మెగాస్టార్ చిరంజీవి కెరియర్ మంచి పిక్స్ ఉన్న సమయంలోనే రాజకీయాల వైపు దృష్టి పెట్టి సినిమాలకు దూరం అయ్యారు, ఆ తర్వాత సినిమాలలో నటించాలని ఉద్దేశ్యంతో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి, అదే స్థాయిలో విడుదల చేశాడు. ఇలా రీ ఎంట్రీ తర్వాత రెండు సినిమాలను కూడా ఒక దాని తర్వాత ఒక దానిని సెట్ చేసుకుంటూ వచ్చిన చిరంజీవి ప్రస్తుతం మాత్రం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య సినిమా షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేశాడు. అలాగే మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

 ఈ సినిమా తో పాటు మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా షూటింగ్ ను కూడా మెగాస్టార్ చిరంజీవి చక చక పూర్తి చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ లను శరవేగంగా పూర్తి చేస్తున్న చిరంజీవి, బాబీ దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి, ఇప్పటికే ఒక సినిమాను పూర్తి చేసి మరో రెండు సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ బిజీగా ఉన్న చిరంజీవి బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను ప్రారంభించడానికి రెడీగా ఉన్నాడు. ఇలా వరుస సినిమాలను లైన్ లో పెట్టిన చిరంజీవి, వెంకీ కుడుముల దర్శకత్వంలో, మారుతి దర్శకత్వం లో కూడా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: