బుల్లితెరపై సినీ సెలబ్రిటీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అయితే సాధారణంగా బిగ్బాస్ కార్యక్రమంలో ప్రతి వారం ఒక ఎలిమినేట్ అవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది అటు ప్రేక్షకుల ఓట్లను బట్టి తేలిపోతూ ఉంటుంది.. దీంతో అటు ప్రేక్షకులకు కూడా ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయంపై మాత్రం కాస్త క్లారిటీ ఉంటుంది అని చెప్పాలి. కానీ ఇటీవలే  ఎవరూ ఊహించని విధంగా ఏకంగా యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బిగ్ బాస్ హౌస్ లో వీక్ కంటెస్టెంట్ గా ఉన్న వారు నామినేషన్స్ నుంచి సేవ్ అయితే అటు రవి మాత్రం ఏకంగా నామినేషన్స్ లో ఉండి ఎలిమినేషన్ అయ్యాడు. దాదాపుగా బిగ్ బాస్ లో టాప్ 3 లో నిలుస్తాడు అనుకున్న రవి ఎలిమినేట్ అవడం మాత్రం అందరినీ షాక్ కి గురి చేసింది అని చెప్పాలి.  బిగ్ బాస్ నుంచి  రవి ఎలిమినేట్ అవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ఇక బిగ్బాస్ నిర్వాహకుల తీరుపై ప్రస్తుతం ఎంతో మంది అభిమానులు ప్రేక్షకులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బిగ్బాస్ ఒక స్క్రిప్టెడ్ షో  అనీ అందుకే ప్రేక్షకుల ఓట్ల ప్రకారం కాకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన రవి ని ఎలిమినేట్ చేశారు అంటూ అటు సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ఆరోపణలు కూడా చేస్తూ ఉండటం గమనార్హం. అయితే రవి ఎలిమినేషన్ పై ఇటీవలే బిగ్ బాస్ నుంచి మొదటి వారం ఎలిమినేట్ అయిన  ఉమా దేవి స్పందించింది. రవి ఎలిమినేషన్ షాకింగ్ అనీ.. రవి ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అనీ అర్ధం అయ్యింది అంటూ ఉమా దేవి షాకింగ్ కామెంట్స్ చేసారు. నామినేషన్స్ జెన్యూన్ గానే జరుగుతాయాని.. ఎలిమినేషన్స్ మాత్రం స్క్రిప్టెడ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: