నందమూరి వారి పునాది బహు గట్టిది. టాలీవుడ్ లో ఆ నాటి నుంచి ఈనాటి వరకూ చాలా స్ట్రాంగ్ గా లెగసీ కంటిన్యూ అవుతోంది.  సీనియర్ ఎన్టీయార్ నుంచి జూనియర్ వరకూ అంతా   విపరీతమైన ఇమేజ్ తో ఆడియన్స్ ని రంజింపచేసేవారే. ఇక వారి స్టార్ డమ్ కి ఎక్కడా తిరుగులేదు.

ఎన్టీయార్ నిజానికి తన నట వారసుడుగా హరిక్రిష్ణను అనుకున్నారు. ఆయన 1969 ప్రాంతంలోనే హరి క్రిష్ణను శ్రీక్రిష్ణావతారం చిత్రం ద్వారా బాల నటుడిగా వెండితెరకు పరిచయం చేశారు. ఆ తరువాత తల్లా పెళ్ళామా మూవీ లో కూడా హరి క్రిష్ణ నటనతో అదరగొట్టాడు. అయితే అనూహ్యంగా చిన్న కుమారుడు  బాలక్రిష్ణ దూసుకువచ్చాడు. ఆయన బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయిన చిత్రం తాతమ్మ కల.

ఆ మూవీ సూపర్ డూపర్ హిట్. అంతే, అక్కడ నుంచి ఎన్టీయార్ నట వారసుడు బాలయ్యే అని అంతా ఫిక్స్ అయ్యారు. ఎన్టీయార్ తో కలసి బాలయ్య 11 చిత్రాల్లో నటించారు. ఆయన డైరెక్షన్ లో ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాడు. బాలయ్య సోలో హీరోగా మారిన తరువాత తన సత్తా చాటుకుంటూ వచ్చారు. ఆయన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే వందకు పైగా చిత్రాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.

ఎన్టీయార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ సొంత ఇమేజ్ ని బాలయ్య క్రియేట్ చేసుకుని సక్సెస్ ఫుల్ హీరోగా ఈ రోజుకీ రాణిస్తున్నారు. ఇక మూడవ తరంలో చూసుకుంటే జూనియర్ ఎన్టీయార్ ఇరగదీస్తున్నాడు. జూనియర్ యంగర్ జనరేషన్ హీరోల్లో టాప్ స్టార్ గా ఉన్నాడు. ఇదిలా ఉంటే బాలయ్య అఖండ ప్రె రిలీజ్ ఫంక్షన్ లో తన నోట అబ్బాయి మాట వినిపించాడు. ట్రిపుల్ ఆర్ మూవీని ప్రస్థావనకు తెస్తూ జూనియర్ అంటూ మాట్లాడారు. దాంతో బాలయ్య ఫ్యాన్స్ తో పాటు జూనియర్ ఫ్యాన్స్ లో ఆనందానికి అవధులు లేవు.

బాలయ్య తో వరసబెట్టి సినిమాలు తీస్తున్న మేకర్స్ కూడా చాన్స్ దొరికితే మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. బాలయ్య జూనియర్ లని కలిపే అద్భుతమైన కధ కనుక కుదిరితే మాత్రం ఈ కాంబో తెర మీదకు రావడం ఖాయం. మొత్తానికి బాలయ్య ఎన్టీయార్ లను కలిపే మేకర్స్ ఎవరో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: