మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ లో అపజయం లేని దర్శకుడిగా ఉన్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపిస్తూ ఉండగా ఆయనకు సంబంధించిన పాత్ర యొక్క టీజర్ విడుదలై ఇప్పుడు యూట్యూబ్ లో సంచలన రికార్డులను నమోదు చేస్తుంది. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తూండగా మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేదీన విడుదల కాబోతుంది.

వాస్తవానికి పెద్ద హీరోల సినిమాలు విడుదలలు ఎక్కువగా పండుగ సందర్భం లోనే ఉంటాయి. ఆ విధంగా ఈ సినిమా దసరా సందర్భంగా కానీ దీపావళి కి గాని క్రిస్మస్ కి గాని ఈ సంక్రాంతికి గానీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా పండుగ సందర్భంలో కాకుండా ఎలాంటి పండుగ లేని ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాంతో ఒక్కసారిగా మెగా అభిమానులు అలాగే సినిమా వారు సైతం ఈ సినిమా విడుదల అప్పుడు జరగడం ఏంటి అని ఆశ్చర్య పోయారు. కానీ మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న నిర్ణయం వెనుక తప్పకుండా ఓ మంచి కారణం ఉంటుందని వారే చెబుతున్నారు.

వాస్తవానికి చిరంజీవి పండుగ సందర్భంలో గుంపులో గోవింద లాగ రావడం కంటే ఎలాంటి హడావుడి లేకుండా రావడమే మంచిదని మొదటి నుంచి భావించాడట. దానికి కారణం ఈ సినిమాపై ఆయనకున్న నమ్మకం అని అంటున్నారు. కొరటాల శివ సినిమాలలో కథ ముఖ్యమైన కథానాయకుడిగా ఉండటం మనం చూస్తున్నాం. అలాగే ఈ సినిమాలో కూడా కథ చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. అలాంటి కథను నమ్మి ఈ సినిమా సోలో గా విడుదల చేస్తే తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చిరంజీవి భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇక ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ఈ చిత్రం పై అంచనాలు భారీ గా పెంచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: