ఇటీవలే చాలామంది యువ హీరోలు తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చి చిన్న చిన్న సినిమాలు చేసి తమ సత్తా చాటుకుని హీరోగా నిలదొక్కుకున్నారు.  ఈ నేపథ్యంలోనే తెలుగులో హీరోలుగా ఉన్న కిరణ్ అబ్బవరం, ఆనంద్ దేవరకొండ, సిద్ధార్థ జొన్నలగడ్డ, సత్యదేవ్ వంటి హీరోలు చిన్న చిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించి ఇప్పుడు మంచి మంచి సంస్థలలో హీరోలుగా చేస్తూ తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారు కూడా సినిమా పరిశ్రమలో ఉంటూ పెద్ద సంస్థల చూపు వారిపై పడే విధంగా నటించి ముందుకు దూసుకుపోతున్నారు.

ముందుగా ఆనంద్ దేవరకొండ గురించి చెప్పాలి. విజయ్ దేవరకొండ తమ్ముడు గా పరిశ్రమలోకి వచ్చిన తొలి సినిమా నుంచి తన స్థాయికి తగ్గ సినిమాలు చేస్తూ ఇప్పటివరకు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ విధంగా ఆయన ఇప్పుడు గీతా ఆర్ట్స్ సంస్థ లో సినిమా చేసే విధంగా ఎదిగారు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆయన హీరోగా బేబీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ నిర్మించడం విశేషం. ఇప్పటివరకు చిన్న నిర్మాణ సంస్థ లో నటించిన ఆయన ఇప్పుడు గీతాఆర్ట్స్ లాంటి సంస్థలో నటించడం విశేషం.

ఇక మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా మైత్రి మూవీస్ బ్యానర్ పై ఓ సినిమాను మొదలు పెట్టి తాను మంచి హీరో అవుతానని చాటి చెప్పాడు. ఇటీవల ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో ఆయన ప్రేక్షకులను అలరించగా ఇప్పుడు మరిన్ని సినిమాలు ముందుకు రాబోతున్నాయి. ఇప్పుడు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లాంటి భారీ బ్యానర్ సినిమాలో ఆయన హీరోగా నటించడం పెద్ద విషయం అని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ను నిర్మిస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ లో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఓ సినిమా చేస్తున్నారు. ఈ విధంగా కొంతమంది యువ హీరోలు కూడా మంచి ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలు చేస్తూ తమ సత్తా చాటుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: