మల్టీ స్టారర్ మూవీస్ అంటే చాలా లెక్కలు ఉంటాయి. నిజానికి మల్టీ స్టారర్ మూవీస్ ని తీయడం చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఇద్దరు హీరోలకీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. దాంతో బ్యాలన్స్ చేయడం బహు కష్టం ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఇబ్బంది వస్తుంది.

గతంలో అంటే 80 దశకంలో టాలీవుడ్ లో ఇద్దరు టాప్ స్టార్స్ తో మల్టీ స్టారర్ మూవీస్ ఎక్కువగా వచ్చేవి. అలా శోభన్ బాబు క్రిష్ణ చాలా సినిమాలు చేశారు. అయితే ఈ ఇద్దరు చివరిగా చేసిన సినిమా మహా సంగ్రామం. ఆ మూవీలో శోభన్ బాబుకు స్క్రీన్ షేర్ తక్కువగా ఉండడంతో ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున  గొడవ చేశారు. ఆ తరువాత శోభన్ బాబు  ఇద్దరి హీరోల సినిమాలకు ఒక్కసారిగా గుడ్  బై చెప్పేశారు.

అలా మల్టీ స్టారర్ మూవీస్ కి బ్రేక్ పడింది. తిరిగి ఇన్నాళ్ళకు జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ తో రాజమౌళి మల్టీ స్టారర్ మూవీని తీస్తున్నారు. ఈ మధ్యలో ఇద్దరు హీరోల సినిమాలు వచ్చినా అవి రియల్ మల్టీ స్టారర్స్ అయితే కావు. సరిసమానమైన ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోలు పందెం కోళ్ళలా వీర విహారం చేస్తూంటే జనాలకు కనుల విందుగా ఉంటుంది. అలాంటి మ్యాజికి చూపించడానికి రాజమౌళి రెడీ అయ్యారు.

ఆయన ట్రిపుల్ ఆర్ తో ఈ ఇద్దరినీ కలిపారు. అంతే కాదు, టాలీవుడ్ ని దశాబ్దాలుగా శాసిస్తున్న నందమూరి, మెగా ఫ్యామిలీస్ ని కూడా కలిపారు. ఇక ట్రిపుల్ ఆర్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మూవీ రన్ టైమ్ మూడు గంటలకు పైగా ఉంటుందని అంటున్నారు. ఈ మూవీలో అల్లూరి పాత్ర రామ్ చరణ్ ది అయితే కొమరం భీమ్ గా జూనియర్ కనిపిస్తాడు. కల్పిత కధతోనే రాజమౌళి ఈ మూవీ తీస్తున్నారు అంటున్నారు.

అయితే ఈ మూవీలో జూనియర్ చరణ్ లలో ఎవరికి ఎక్కువ స్క్రీన్ షేర్ ఉంటుంది అన్న చర్చ అయితే వస్తోంది. ఇద్దరి పాత్రలూ సరిసమానంగా చూపించే ప్రయత్నం అయితే మేకర్స్ చేశారు. కానీ అభిమానులు ఊరుకోరు కదా ఒక నిముషం అటూ ఇటూ తేడా వచ్చినా కూడా గగ్గోలు పెట్టేస్తారు. మరి ఎవరికి కూడా ఏ మాత్రం ఎక్కువ తక్కువలు అనిపించకుండా స్క్రీన్ ని పంచడం అంటే రిస్కీ టాస్క్. దీన్ని రాజమౌళి ఎలా చేదించారో జనవరి 7న వెండి తెర మీద చూడాల్సిందే. ఇకపోతే ఎన్టీయార్ స్క్రీన్ షేర్ కొంచెం తక్కువ అన్నట్లుగా అని జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు మరి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: