దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' బడ్జెట్‌ ఎంత భారీగా ఉందో, ప్రమోషన్స్‌ని కూడా అంతే భారీగా ప్లాన్ చేస్తున్నాడు. దాదాపుగా 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచడానికి ప్రమోషన్స్‌లో స్పీడ్‌ కూడా పెంచుతున్నాడు. మల్టిపుల్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్స్‌ కండక్ట్‌ చెయ్యబోతున్నారట మేకర్స్. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

'బాహుబలి' తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తాడు అని ఇండస్ట్రీ జనాలంతా ఎదురుచూస్తోన్న టైమ్‌లో 'ఆర్ ఆర్ ఆర్' అనౌన్స్‌ చేశాడు. టాలీవుడ్‌ కూడా ఎక్స్‌పెక్ట్‌ చెయ్యని రేంజ్‌లో నందమూరి, కొణిదెల హీరోలతో మల్టీస్టారర్‌ మొదలుపెట్టాడు. మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ పాత్రల స్ఫూర్తితో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా తీశాడు.

'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి అనౌన్స్‌మెంట్‌తోనే మంచి బజ్‌ వచ్చింది. అయితే ఎంత హైప్స్‌ ఉన్నా ఒక్క తెలుగు మార్కెట్‌తోనే 500 కోట్లకి పైగా బడ్జెట్‌ని రికవరీ చెయ్యడం కష్టం. అందుకే 'ఆర్ ఆర్ ఆర్'ని మల్టిపుల్‌ లాంగ్వేజస్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని దేశవ్యాప్తంగా ప్రమోట్‌ చెయ్యడానికి పాపులర్‌ చైన్ ఆఫ్ మల్టీప్లెక్స్ పివిఆర్‌తో డీల్‌ కుదుర్చుకున్నాడు జక్కన్న. ఇక ఈ సినిమాని ప్రమోట్ చెయ్యడానికి పివిఆర్ సినిమాస్‌ని పివిఆర్ఆర్ఆర్‌గా మార్చింది సంస్థ.

'బాహుబలి'తో పోల్చితే ఇండియన్‌ ఆడియన్స్‌లో 'ఆర్ ఆర్ ఆర్'పై కొంచెం బజ్ తక్కువగానే ఉంది. దీంతో అంచనాలు పెంచడానికి ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారట. 'జనని' సాంగ్‌ లాంచ్‌తో ప్రమోషన్స్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి. దీంతో 'ఆర్ ఆర్ ఆర్' ఎన్ని భాషల్లో విడుదల అవుతుందో అన్ని భాషల్లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. చూద్దాం.. దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ ను ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. ప్రేక్షకుల్లో మాత్రం అంతా సస్పెన్స్ గానే ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: