నందమూరి వారి తో సినిమా అనగానే బోయపాటి శ్రీను కు ఎక్కడలేని పూనకం వస్తుందో ఏమో... వారి ఇమేజ్ కు తగ్గట్లు వారి అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఆయన సినిమాలు చేసి నందమూరి వారి హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు. దర్శకుడిగా ఆయన ఏ హీరోతో సినిమా చేసినా తనదైన ముద్ర వేసుకుంటాడు. బోయపాటి శ్రీను మార్కు ఉండేలా తన ప్రతి సినిమాలో చూసుకునే ఆయన ఇప్పుడు బాలకృష్ణ హీరోగా అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ను మొదలు పెట్టి రెండు సంవత్సరాలు అవుతున్నా బోయపాటి శ్రీను కరోనా కారణంగా దీనిని విడుదల చేయలేకపోయాడు.

 గతంలో లెజెండ్ సినిమా చేసిన బోయపాటి శీను అక్కడ అనుకోకుండా వచ్చిన ఓ సెంటిమెంట్ ఇప్పుడు అఖండ సినిమాలో నిజమైతే చాలా బాగుంటుందని ఆయన అభిమానులు నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. బాలకృష్ణ తో కలిసి ఆయన రెండు సినిమాలు చేయగా మూడవ సినిమాగా అఖండ సినిమా రాబోతుంది. ఇప్పటివరకు బాలకృష్ణ తో చేసిన ఆయన రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్ నిలవగా ఈ చిత్రం కూడా వాటిలాగానే ఇండస్ట్రీ హిట్ గా నిలిచి పోయి భారీ వసూళ్లను సాధిస్తుందని భావిస్తున్నారు.


దానికి తగ్గట్టుగానే నందమూరి అభిమానులు ఓ సెంటిమెంట్ నమ్ముతూ ఈ చిత్రం కూడా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా కూడా భారీ హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. లెజెండ్ సినిమా కంటే ముందు బోయపాటి శ్రీను ఎన్టీఆర్ తో కలిసి దమ్ము అనే సినిమా చేశాడు. ఆ చిత్రం అనుకున్న రేంజ్ లో హిట్ కాకపోవడంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని బాలకృష్ణ లెజెండ్ సినిమా చేయగా అది వారి కెరీర్ లో నే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు కూడా బోయపాటి శీను అఖండ సినిమా కి ముందు వినయ విధేయ రామ తో భారీ ఫ్లాప్ అందుకున్నాడు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని ఆయన భావించి ఈ సినిమా చేశాడు. ఎంతో కసి తో చేసిన ఈ సినిమాలు సూపర్ హిట్ గా నిలవడం తో ఒక ఫ్లాప్ తర్వాత బోయపాటి శీను చేస్తున్న ఈ సినిమా కూడా దానిలాగే సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని వారు వ్యక్తపరుస్తున్నారు. మరి అఖండ వారి నమ్మకాన్ని నిజం చేస్తుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: