యాంకర్ గా ఆరియానా కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇమే మైకు పట్టింది అంటే చాలు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటుంది. ఇక అంతకు ముందే ఇమే బిగ్ బాస్ లో కూడా కొన్ని వారాలపాటు ఉన్నది. కొద్దిరోజుల క్రితమే రాంగోపాల్ వర్మ తో కలిసి కొన్ని వీడియోలు చేసి ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే హీరో రాజ్ తరుణ్ పట్ల ఆమెకున్న కోపాన్ని తెలపడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

ఆరీయానాకి ఒకప్పుడు రాజ్ తరుణ్ అంటే ఏమాత్రం నచ్చేది కాదట. రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం అనుభవించు రాజా మూవీ ప్రేక్షకుల ముందుకు విడుదలైంది.ఈ సినిమా ప్రమోషన్లలో ఆరీయానా మాట్లాడుతూ.. అందుకు గల కారణాన్ని తెలిపింది. నాకు వాస్తవానికి రాజ్ తరుణ్ అంటే ఒకప్పుడు అసలు ఇష్టం లేదని.. ఈ హీరో సినిమా టీవీలో వస్తే చాలు తీసేయమని అనేదాని తెలిపింది. ఒకానొక సమయంలో ఈయన కారులో వెళ్తుంటే ఆయనకి యాక్సిడెంట్ కావాలని కోరుకున్నానని అని తెలిపింది.

ఒకానొక సమయంలో ఇంటర్వ్యూ కోసం నన్ను పిలిచి ఉదయం నుంచి మధ్యాహ్నం 2:00 అయినా ఎవరూ రాకపోవడంతో అలా అనిపించింది అని, కానీ వాస్తవానికి  ఈ విషయంలో రాజ్ తరుణ్ కు సంబంధం లేదని నాకు తెలిసింది. అలా ఎంతసేపు వెయిట్ చేశాను. కానీ రాజ్ తరుణ్ నా కళ్ళముందే కార్లో వెళ్ళిపోయారు. కానీ ఆ పక్కన ఉన్న వ్యక్తి ని అడిగితే సార్ సినిమా డబ్బింగ్ చెప్పడానికి వెళ్తున్నారని తెలియజేశారు.

ఇక జీవితంలో రాజ్ తరుణ్ తో మాట్లాడకూడదని అనుకున్నాను. అలా అంతటి కోపాన్ని పెట్టుకున్న నేను నా మొదటి సినిమా తనతోనే నటించే అవకాశం రావడంతో నేను షాక్ అయ్యాను అని తెలిపింది. నాకు నచ్చని  వ్యక్తితో సినిమా ఏంటి అని ఆలోచించాను.  కానీ నేను ఈ సినిమాలో కనిపించేది కేవలం కొన్ని నిమిషాలు కదా అని ఓకే చేశాను అని తెలిపింది. తరువాత మేమిద్దరం రెండు రోజులకి మంచి ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: