జనవరి 7న విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా ప్రారంభం అయింది. డిసెంబర్ 2న విడుదలకాబోతున్న ‘అఖండ’ మూవీ టిక్కెట్స్ కు బుక్ మై షో యాప్ లో వస్తున్న స్పందన చూసినవారికి ‘ఆర్ ఆర్ ఆర్’ కలక్షన్స్ పరంగా చరిత్ర సృష్టించడం ఖాయం అని అంటున్నారు.


దీనికి తగ్గట్టుగానే ‘ఆర్ ఆర్ ఆర్’ బిజినెస్ బాగా జరగడంతో పాటు ఈమూవీ సంక్రాంతి పండుగకు సరిగ్గా వారం రోజులు ముందు విడుదల అవుతున్న పరిస్థితులలో కలక్షన్స్ పరంగా ఈమూవీకి ఎదురులేదు అన్న అంచనాలు ఉన్నాయి. సుమారు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈమూవీలో నటించిన నటీనటులకు కూడ పారితోషికాలు చాల ఎక్కువగా ఇచ్చినట్లు లీకులు వస్తున్నాయి.


ఈసినిమాలో చరణ్ జూనియర్ లు నటించినప్పటికీ ఈమూవీలో సీత పాత్రలో కనిపించబోతున్న అలియా భట్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈమూవీలో అలియా భట్ కేవలం 15 నిముషాలు మాత్రమే కనిపిస్తుందని టాక్. ఈ 15 నిముషాల పాత్రకు ఆమె ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాతల నుండి 6 కోట్లు పారితోషికం తీసుకుంది అని అంటారు. బాలీవుడ్ లో అలియా భట్ కు ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ ఆమెకు అక్కడి ప్రముఖ నిర్మాణ సంస్థలు 10 కోట్ల పారితోషికం మించి ఇవ్వరు అన్న టాక్ నడుస్తోంది.


అయితే కేవలం 15 నిముషాల పాత్రకు అలియా కు 6 కోట్లు పారితోషికం ఇచ్చే విషయంలో నిర్మాతలు మొదట్లో వెనకడుగు వేసినప్పటికీ ఈమూవీలో సీత పాత్రను ఒక్క అలియా తప్ప మరెవ్వరు సహజంగా నటించలేరు అని రాజమౌళి పట్టుపట్టడంతో అలియా టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయింది అని అంటున్నారు. ఎప్పటి నుండో అనేకమంది టాప్ యంగ్ హీరోలు అలియా భట్ తో నటించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె తెలుగు సినిమాల పై పెద్దగా ఆశక్తి కనపరచలేదు. అయితే రాజమౌళి పట్ల ఆమెకు ఉన్న ప్రత్యేకమైన గౌరవం ‘ఆర్ ఆర్ ఆర్’ వైపు ఆమెను నడిపించింది అన్న మాటలు ఉన్నాయి..
మరింత సమాచారం తెలుసుకోండి: