ఒకనాటి గ్లామర్ హీరోయిన్ మీనా పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిన తరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇప్పుడు ఆమెకు మళ్ళీ సినిమాల పై మోజు పెరగడంతో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ తన సెకండ్ ఇన్నింగ్స్ ను విజయవంతంగా ప్రారంభించింది.


లేటెస్ట్ గా అమెజాన్ లో స్ట్రీమ్ అవుతున్న ‘దృశ్యం 2’మూవీలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించడంతో ప్రస్తుతం ఆమె అనేక మీడియా సంస్థలకు వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తోంది. తనకు మంచి పాత్రలు లభిస్తే ఇంకా నటించాలని ఉంది అని చెపుతూ అయితే తాను యంగ్ హీరోలకు అక్క అమ్మ వదిన పాత్రలు మాత్రం చేయను అని చెపుతోంది.


అంతేకాదు తనకు జీవితంలో ఒక తీరని కోరిక ఉంది అంటూ ఆకోరికను తీర్చవలసిందిగా సంగీత దర్శకులు కీరవాణి తమన్ లకు విన్నపాలు చేసుకుంటోంది. తనకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం అంటే చాలఇష్టం అని అయితే తనకు సంగీతం రాకపోయినా చాల బాగా పాడగలను అన్న నమ్మకం తనకు ఉందని అందువల్ల ఎవరైనా అవకాశాలు ఇస్తే తాను పాటలు పాడటానికి రెడీ అంటోంది.


ఇదే సందర్భంలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేస్తోంది. ప్రస్తుతం నటించడం చాల సులువని టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఎవరైనా నటించవచ్చు అనీ దీనికి పెద్దగా అనుభవం అక్కరలేదు అంటూ కామెంట్స్ చేసింది. అయితే తాను హీరోయిన్ గా ఉన్న కాలంలో ఇంత టెక్నాలజీ లేదనీ అందువల్ల చాల కష్టపడి నటించవలసి వచ్చింది అంటూ నేటితరం నటీ నటులకు పెద్దగా కష్టపడకుండానే పేరు డబ్బు బాగా వచ్చే ఆస్కారం ఉంది అంటూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో పాటలు పాడేవారి సంఖ్య విపరీతంగా పెరిగి పోవడంతో కొందరికి అవకాశాలు కూడ రావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో మీనా కు గాయని గా ఎవరు అవకాశాలు ఇస్తారు అన్నది సందేహం..  
మరింత సమాచారం తెలుసుకోండి: