బిగ్ బాస్ సీజన్ 5 రియాలిటీ షోను చూడని వారంటూ ఎవరూ ఉండరు ఈషా ను చిన్న పెద్ద తేడా లేకుండా చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు. అయితే బిగ్ బాస్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది బిగ్ బాస్ వాయిస్.బిగ్ బాస్ కోరిక మేరకు మీరు కన్ఫెషన్ రూమ్ కి రండి... ఇంటి నియమాలను పాటించడం అందువలన బిగ్ బాస్ మిమ్మల్ని శిక్షిస్తున్నారు... అంటూ ఇంట్లో ఉన్న సభ్యులతో బిగ్ బాస్ మాట్లాడుతూ ఉంటారు.అయితే బిగ బాస్ చూసే వారందరికీ కూడా బిగ్ బాస్ వాయిస్ అంటే చాలా ఇష్టం. ఈ వాయిస్ ఎవరిది అనే ప్రశ్న కూడా ప్రేక్షకుల్లో చాలా సార్లు వచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ గొంతు ఎవరిదో మాత్రం ఎవరికీ తెలియదు. 

అయితే బిగ్ బాస్ వాయిస్ తోనే అందరినీ ఆకట్టుకుంటూ షోను చూసేలా చేస్తుంది ఆ గొంతు. బిగ్ బాస్ అనే ఆ షో కి ఇంత క్రేజ్ రావడానికి ఈ గొంతు కూడా ఒక కారణమని చెప్పొచ్చు. అసలు ఈ బిగ్ బాస్ ఎవరు..? బిగ్బాస్ అని మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు..? అసలు బిగ్ బాస్ అని చెప్పి వాళ్ల అందరితో గేమ్ ఆడిస్తున్న ఆ స్వరం ఎవరిది..? కనిపించకుండా వినిపిస్తున్న ఆ గొంతు ఎవరిది..?ఈ గొంతు విని బిగ్ బాస్ షో వచ్చే ప్రతీ రోజు ఈ షో ను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు ప్రేక్షకులు. అయితే విషయానికి వస్తే బిగ్ బాస్ షో లో బిగ్బాస్ అని మాట్లాడుతున్న వ్యక్తి రాధా కృష్ణ అనే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ది. ఈ షో ఇంత పాపులారిటీ సంపాదించుకోవడానికి ముఖ్యకారణం రాధాకృష్ణ వాయిస్ అనే చెప్పాలి. అయితే మేకర్స్ కి అచ్చం ఇలాంటి వాయిస్ కావాలని చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టుల వాయిస్ లు టెస్ట్ చేశారు.

 కానీ ఎవరి వాయిస్ కూడా వాళ్లకి కావలసిన వాయిస్ లో రాలేదు చివరలో రాధాకృష్ణ వాయిస్ మాత్రం వాళ్ళు అనుకున్న విధంగా రావడంతో కృష్ణని ఫైనల్ చేశారు. ఈయన వాయిస్ కారణంగా ఇంతకింతకు ఈ షో పాపులారిటీ పెరిగిపోతుంది. అయితే బిగ్ బాస్ అనే షో మొదలైనప్పటి నుంచి రాధాకృష్ణనే బిగ్ బాస్ లాగా వాయిస్ ఇస్తున్నాడు. అయితే ఈయన బిగ్ బాస్ లాంటివి కాకుండా హిందీ నుంచి తెలుగులోకి వచ్చిన సి ఐ డి ఇలాంటి వాళ్లకు కూడా డబ్బింగ్ చెప్తాడు. ప్రస్తుతం తన గొంతుతో బాగా ఫేమస్ అయ్యాడు రాధాకృష్ణ. అందరూ తమ ముఖాన్ని చూపించి ఫేమస్ అయితే రాధాకృష్ణ మాత్రం గొంతుతో ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్  వాయిస్ చెప్పడం వల్ల ఆయనకి సినిమాల్లో కూడా బాగా అవకాశాలు వస్తున్నాయి. అయితే బిగ్ బాస్ షో కారణంగా తను ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉన్నానని దీనివల్ల తన కెరియర్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా మారిందని అంటున్నారు...!!



మరింత సమాచారం తెలుసుకోండి: