ఈ మధ్య కాలంలో మన తెలుగు లో ఉన్న అగ్రహీరోలు కొంతమంది నిర్మాతగా మారడానికి ప్రయత్నాలు చేయడం ఈ నేపథ్యంలోనే కొంతమంది దర్శక నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరగడం వంటివి కాస్త ఎక్కువగా ఉన్నాయి. కొంత మంది అగ్ర హీరోలు నిర్మాతలుగా మారడానికి చిన్న చిన్న సినిమాలను నిర్మించడానికి సిద్ధమవుతున్నారని భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా చిన్న సినిమాలు అయితే బాగుంటుందనే భావనలో ఉన్నారని ఈ మధ్యకాలంలో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గత కొన్ని రోజులుగా నిర్మాతగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రచారం ఎక్కువగా జరిగింది.

అయితే ఇప్పుడు అది నిజమే అనే వ్యాఖ్యలు కూడా టాలీవుడ్ వర్గాలలో వినబడుతున్నాయి. ఒక కొత్త హీరోని జూనియర్ ఎన్టీఆర్ పరిచయం చేయబోతున్నాడని ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ గా ఉండటమే కాకుండా హీరో పాత్ర కూడా కాస్త ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చూపిస్తూనే హీరో పాత్రను కూడా ఎలివేట్ చేసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించి అవకాశం ఉందని త్వరలోనే దీనికి సంబంధించి సుకుమార్ తో మాట్లాడుతున్నాడు అని ఈ సినిమాను బుచ్చి బాబు తెరకెక్కించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ 8 కోట్లు పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాడని 8 కోట్లతో ఈ సినిమాకు సంబంధించి కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అవసరమైతే మరో హీరో కూడా దీంట్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించి ఇది ఎంతవరకు ముందుకు రాబోతున్నారు ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాలి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తుండగా ఆ తర్వాత కన్నడ దర్శకుడితో అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: