సినిమా తారలు వెండి తెరపై కనిపిస్తే చాలు.. వారి అభిమానులు ఎంతో ఆనందంగా ఈలలు వేస్తూ ఉంటారు. ఇక ఒకసారి వారు జనాల్లోకి వచ్చారంటే వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇక వారు అంత సక్సెస్ కావడానికి షూటింగ్ సమయంలో వారు ఎదుర్కొనే కష్టాలు సైతం ఎవరికీ తెలియవు. చాలా జాలిగా షూటింగ్లో పాల్గొంటూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. అయితే షూటింగ్ అంటే అంత ఆషామాషీ విషయం అయినది కాదు. సినిమా అంతటికీ హీరో హీరోయిన్లు చాలా కష్టపడి యాక్టింగ్ చేయవలసి ఉంటుంది.

షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలను సెట్ కాకపోతే పదుల సంఖ్యలో సన్నివేశాలను చిత్రీకరించిన సమయాలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి సమయంలోనే కొంతమంది నటులు గాయపడుతూ ఉంటారు. ముఖ్యంగా మన హీరోయిన్స్ సైతం కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇక హీరోయిన్స్  ఎంతో సుకుమారంగా ఉంటారనే విషయం మనకు తెలిసిందే. అలాంటి వారికి చిన్న గాయం తగిలితే చాలు ఎంతో హడావిడిగా చేస్తూ ఉంటారు అభిమానులు.. సెట్లో ఉండే యూనిట్ సభ్యులు కూడా..

అయితే తాజాగా హీరోయిన్ మాళవిక మోహన్ కి కూడా ఇలాంటి దుర్ఘటన ఎదురైంది. ఆమెకు తన కుడిచేతివైపు గాయం అయిన ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. యాక్షన్ సన్నివేశాలలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇలాంటి గాయాలయ్యాయని తెలిపింది. ఇక మాళవిక సినిమాల విషయానికి వస్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి పేట మూవీ లో నటించింది.
దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం ఆమె వైపు మళ్ళింది. ఇక విజయ్ తో కలిసి కూడా మాస్టర్ మూవీలో నటించింది. దీంతో ఈమె తమిళంలో స్టార్ హీరోయిన్ గా మారింది.ఇక ఇప్పుడు హీరో ధనుష్ తో కలిసి, అలాగే ఎన్టీఆర్ తో కూడా మూవీలో నటిస్తున్నది. ఈ సంవత్సరంలో తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటిస్తున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: