సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతున్న  పాన్ ఇండియా సినిమా పుష్ప.ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎక్కడ చేస్తారు అనే విషయం మాత్రం ఇంకా ఎవరికీ తెలియదు.అల్లుఅర్జున్ ఫాన్స్ కి ఇప్పుడు ఈ విషయం పై ఆసక్తి పెరిగింది.అయితే ఇండస్ట్రీలో వస్తున్న వార్తల ప్రకారం హైదరాబాదులోనే  ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.ఈ ఈవెంట్ ను డిసెంబర్ 12వ తేదీన జరపనునట్టు తెలుస్తుంది.అయితే ఇదే డేట్ ఫిక్స్ చేస్తారని అంటున్నారు మేకర్స్.సుకుమార్ మాత్రం ఈ ఈవెంట్ నే మరో రేంజిలో చేయనున్నారు.

ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా పలువురు స్టార్స్‌ని గెస్టులుగా ఆహ్వానిస్తున్నారట.పక్కా ప్లాన్ తో అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు సుకుమార్.మునుపెన్నడూ ఎవరు చేయని విధంగా ఈ ఈవెంట్ ను చేయనున్నారు సుకుమార్.అయితే స్టార్ గెస్ట్ లిస్ట్ లో ప్రభాస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.ఇటీవల వచ్చిన "రొమాంటిక్" సినిమా కోసం  ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రభాస్ అల్లుఅర్జున్ "పుష్ప" సినిమా  కోసం ఈ వేడుకకి హాజరు అవుతానని హామీ ఇచినట్టుగా తెలుస్తుంది.ప్రభాస్ ఈ ఈవెంట్ కి హాజరైతే ఇక ఆ ఈవెంట్ వేరే రేంజ్ లో ఉంటుంది.ప్రభాస్ వస్తే  ప్రమోషన్ ఈజీ అయిపోతుందని టీమ్ భావిస్తోందిట..

అల్లుఅర్జున్ హీరో గా నటిస్తున్న పుష్ప సినిమాను ఇక్కడే కాకుండా కేరళలో లో భారీ రేంజ్ లో విడుదల చేస్తున్నారు.అయితే కేరళలో మాత్రమే పుష్ప విడుదల తేదీన 40 ఫ్యాన్ షో లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఎప్పటి నుండే ఈ సినిమా టిక్కెట్లు కూడా బుకింగ్లు చేసుకుంటున్నారట.మలయాళ నటుడు  ఫాహాధ్ ఫాసిల్ కూడా ఈ సినిమాలో నటించడం తో ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారుమలయాళ  ప్రేక్షకులు.డిసెంబర్ 17వ ప్పుష్ప సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది.అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆ రేంజ్ లో ఉంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: