యాంకర్ రవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవి. బుల్లితెర మాటీవీలో ప్రసారమయ్యే లవ్ జంక్షన్ అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా అడుగుపెట్టిన రవి.. ఆ తర్వాత తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ యాంకర్ గా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.ఇక ఇటీవలే రియాలిటీ గేమ్ షో అయిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న రవి టాప్ 5 వరకు చేరుకోకముందే 12వ వారం ఎలిమినేట్ హౌస్ నుండి బయటకు వచ్చేసాడు. ఇదిలా ఉంటే బుల్లితెరపై యాంకర్గా కొనసాగుతున్న కొందరు వెండితెరపై కూడా యాక్టర్స్ గా తమ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.

 అందులోనూ యాంకర్ రవి కూడా వెండి తెరపై అడపాదడపా సినిమాల్లో నటించే తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే వెండితెరపై అంతగా గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ బుల్లితెరపై యాంకర్గా సెటిలైపోయాడు. ఈ క్రమంలోనే వెండితెరపై రవికి ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చినా వాటిని వదులుకున్నాడు. ఈ క్రమంలోనే యాంకర్ రవి నో చెప్పిన సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ 'మహర్షి' సినిమా కూడా ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు.

వైజయంతి మూవీస్, పివిపి సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమా నిర్మితమైంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకి పర్సనల్ అసిస్టెంట్ గా మొదట యాంకర్ రవి అనుకున్నారట దర్శకులు నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే యాంకర్ రవి ని సంప్రదించగా.. ఆ సమయంలో రవి బుల్లితెరపై బిజీగా ఉండటంతో ఈ ఆఫర్ ని తిరస్కరించాడట. దీంతో రవి ని సెలెక్ట్ చేసిన పాత్రలో మహేష్ బాబు పర్సనల్ అసిస్టెంట్ గా శ్రీనివాస్ రెడ్డి నటించాడు. సినిమాలో శ్రీనివాసరెడ్డి కూడా పర్సనల్ అసిస్టెంట్ గా తన నటనతో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఒకవేళ యాంకర్ రవి కనుక ఈ పాత్ర చేసి ఉంటే వెండితెరపై రవి కి మంచి గుర్తింపు వచ్చి ఉండేదేమో...!!

మరింత సమాచారం తెలుసుకోండి: