తెలుగు సినిమాల్లో కాస్త వినూత్న ప్రయత్నాలు చేసే వారిలో కచ్చితంగా ముందు వరుసలో ఉండే హీరో రానా. ఏ పాత్ర అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉండే రానా తెలుగులో కాస్త కొత్త కొత్త ప్రయత్నాలు చేసేందుకు తన సంగీత దర్శకులతో అలాగే తన స్నేహితులతో ఎక్కువగా చర్చలు జరుపుతూ ఉంటారని ఆయన గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు. ప్రస్తుతం రానా సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా బిజినెస్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టి కాస్త బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలను నిర్మించే ప్లాన్ కూడా చేస్తున్నాడని ప్రచారం కూడా జరుగుతోంది.

అయితే ఇది పక్కన పెడితే రానా ఇప్పుడు ఒక సినిమా విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ గా మారడానికి రెడీగా ఉన్నాడని తన స్నేహితుడు నటిస్తున్న సినిమాకు సంబంధించి మ్యూజిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి రానా ఒక కొత్త ప్లాన్ ని తన స్నేహితుడికి చెప్పాడని అది బాగా నచ్చిందని ఇప్పటికే దీనికి సంబంధించి కూడా రానా పంపించాడని... తనతో సన్నిహితంగా ఉండే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా రానా ఈ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

అయితే ఈ సినిమాకు సంబంధించి రానా మ్యూజిక్ ఎంతవరకు అందిస్తాడని తెలియకపోయినా దేవిశ్రీప్రసాద్ సోదరుడు సాగర్ తో కలిసి ఈ సినిమాకు మ్యూజిక్ అందించే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. దేవిశ్రీప్రసాద్ సలహాలు సూచనలతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నాడని అలాగే సినిమాలో రానా కొంత పెట్టుబడి కూడా పెట్టాడు అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రానా చేస్తున్న సినిమాలు వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. విలన్ గా కూడా రానా ఈ మధ్యకాలంలో బిజీ కావడానికి కాస్త గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: