మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత నందమూరి కుటుంబానికి మంచు కుటుంబానికి మధ్య కాస్త దూరం తగ్గింది అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. కొన్ని రాజకీయ కారణాలతో రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం గత కొంత కాలంగా జరుగుతూ వస్తోంది. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది దానిపై స్పష్టత లేకపోయినా సరే చాలా మంది ఈ విషయంలో అనేక రకాలుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ మంచు మనోజ్ విజయం కోసం కాస్త గట్టిగా ప్రయత్నం చేయడంతో ఆయనకు బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉండగా నందమూరి బాలకృష్ణ సినిమాలో నటించడానికి మంచు కుటుంబానికి సంబంధించిన ఇద్దరు హీరోలు సిద్ధంగా ఉన్నారని మంచు లక్ష్మి కూడా బాలయ్య సినిమాలో నటించడానికి ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. మంచు లక్ష్మి ప్రస్తుతం రెండు సినిమాలకు సంబంధించి బాలకృష్ణ తో చర్చలు జరుపుతుండగా మంచు మనోజ్ బాలయ్య సినిమాలో విలన్ పాత్ర పోషించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ కు విలన్ గా మంచు మనోజ్ నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మంచు మనోజ్ ప్రస్తుతం సినిమాలు లేక ఇబ్బంది పడుతున్నారు.   బాలయ్యతో సినిమా చేస్తే తన కెరీర్ కూడా కలిసి వస్తుందని భావనలో ఉన్నాడు అని అంటున్నారు. మరి ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్ర ఎవిధంగా ఉండబోతుంది విలన్ పాత్ర చేస్తాడా లేక పోతే మరో పాత్ర చేస్తాడు అనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఏది ఎలా ఉన్నా సరే మంచి కుటుంబం నందమూరి బాలకృష్ణకు దగ్గర కావడం మాత్రం టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్న  అంశంగా చెప్పాలి.మరి ఇది ఎంత వరకు నిజమో కాదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: