నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన అఖండ సినిమాను పూర్తి చేసిన విషయం మనందరికీ తెలిసిందే, ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ లు కావడంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ హైడ్రిక్ సినిమాపై మంచి అంచనాలు జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఉండడంతో జనాలు ఈ సినిమా  పై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జనాలలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న అఖండ సినిమా డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమా లో నటించడానికి రెడీగా ఉన్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, ఈ సినిమా లో బాలకృష్ణ  సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది.

 ఇలా ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన బాలకృష్ణ, మరొక సినిమా సెట్స్ మీదకి తీసుకు వెళ్లడానికి రెడీగా ఉన్నాడు. అలాగే  అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా లో నటించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ సినిమా లతో పాటు మరో క్రేజీ బ్యానర్ లో బాలకృష్ణ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యాత్ర మేకర్స్- 70 ఎమ్.ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఓ మూవీ చేయడానికి కి అగ్రిమెంట్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి కొద్ది రోజుల్లోబ్నే ఈ సినిమా ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కి దర్శకుడు ఎవరు.? ఇతర కాస్టింగ్ మరియు మరి కొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: