నందమూరి నట సింహం బాలయ్య బాబు ఆహాలో అన్ స్టాపబుల్‌ షో చేస్తున్న సంగతి అందరికి తెల్సిందే. అయితే మూడు వారాల బ్రేక్ తర్వాత మళ్లీ ఆహాలో అన్ స్టాపబుల్‌ షో తో బాలయ్య మళ్లీ ఎంటర్ టైన్ చేసేందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ షోలో మొదటి రెండు ఎపిసోడ్స్‌ ను మోహన్‌ బాబు, నానిలతో చేసిన బాలకృష్ణ హంగామా చేయగా.. మూడవ ఎపిసోడ్‌ ను ఎమ్మెల్యే రోజాతో చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అంతలోనే బాలయ్య బాబు చేతికి ఆపరేషన్‌ జరగడంతో షూటింగ్ రద్దు చేసిన సంగతి తెల్సిందే. అయితే అదే సమయంలోనే ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, బాలకృష్ణ ప్రెస్ మీట్‌ పెట్టి మరీ వైకాపా ను ప్రభుత్వంను ఇంకా వైకాపా ఎమ్మెల్యేలు మంత్రులను ఏకి పారేసిన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య చేసిన విమర్శలను వైసీపీ వారు కూడా తిప్పి కొట్టారు. కాగా.. అదే సమయంలో  బాలయ్యను కాస్త ఘాటుగానే  విమర్శలు చేశారు. ఈ తరుణంలోనే వైసీపీ ఎమ్మెల్యే అయిన రోజా, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణలు కలిసి ఖచ్చితంగా అన్‌ స్టాపబుల్ లో కనిపించడం అసాధ్యం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ప్రధాన కారణం ఏంటంటే.. రెండు పార్టీలకు చెందిన వారు ఇప్పుడు చాలా ఆవేశాలతో ఉన్న సంగతి తెల్సిందే. ఇక రెండు పార్టీలు  ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నా సంగతి తెల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య రోజాలు అన్ స్టాపబుల్‌ అంటూ షో లో సందడి చేస్తే జనాలు ఊరుకుంటారా.. మేము కొట్టుకుంటూ ఉంటే మీరు మీరు ఒకటా అన్నట్లుగా ఫైర్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపియనున్నది.

ఆ కారణంగానే ఇప్పట్లో రోజాతో టాక్ షో కు బాలయ్య ఆసక్తి చూపించడం కష్టం అనే చెప్పాలి మరి. బాలకృష్ణ, బ్రహ్మానందంలు కలిసి మూడవ ఎపిసోడ్‌ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఎపిసోడ్స్ కి ఎవరు వస్తారో చూడాలి మరి. ప్రస్తుతం బాలయ్య నటించిన అఖండ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: