నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో మన అందరికీ తెలిసిందే, బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ పనులను పూర్తి చేసుకున్నాడు, ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా లో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటించగా శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్ర లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై జనాల్లో  మంచి అంచనాలు నెల కొని ఉన్నాయి, దానికి ప్రధాన కారణం ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సింహ, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడం మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షం కురిపించాయి, అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  హైడ్రిక్ సినిమా కావడంతో అఖండ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని జనాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ సినిమా తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమా లో నటించడానికి రెడీ గా ఉన్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి, ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించ బోతోంది. ఇలా ఒక సినిమా విడుదలకు సిద్ధం గా ఉండగానే,  మరో  సినిమా ను సెట్ చేసి పెట్టుకున్న బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్క బోయే సినిమా జూలై నుండి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది, ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరో లుగా తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ తో అనిల్ రావిపూడి సినిమాను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: