మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత మంచి కుటుంబం నందమూరి బాలకృష్ణకు దగ్గర కావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం. మంచు కుటుంబం బాలకృష్ణకు దగ్గర కావడమే కాకుండా అల్లు అరవింద్ నిర్మాణ సారధ్యంలో ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొనడం ఆ తర్వాత బాలకృష్ణ నటించిన సినిమాల్లో నటిస్తామని మంచు కుటుంబానికి సంబంధించి మంచు లక్ష్మి అలాగే మంచు విష్ణు చెప్పడం కాస్త హాట్ టాపిక్ అయిన అంశం. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ రెండు మూడు సినిమాల్లో నటిస్తూ ఉండగా ఆయన సినిమాల్లో నటించడానికి మంచు లక్ష్మి కూడా ప్రయత్నం చేస్తోందని ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య చెల్లెలి పాత్రలో మంచు లక్ష్మి కనబడే అవకాశం ఉందని దీనికి సంబంధించి గోపీచంద్ మలినేని ఆమె పాత్ర విషయంలో కాస్త శ్రద్ధ పెట్టి చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారని కూడా అంటున్నారు. ఈ పాత్రకు సంబంధించి మంచు లక్ష్మి కూడా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడానికి బాలకృష్ణ కూడా ఓకే చెప్పారని అయితే ఈ పాత్ర కాస్త నెగిటివ్ గా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాలో మంచు లక్ష్మి బిజినెస్ ఉమెన్ గా కనపడే అవకాశం ఉందని సమాచారం. ఏది ఎలా ఉన్నా సరే మంచి కుటుంబం బాలకృష్ణకు దగ్గర కావడం మాత్రం సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అలాగే మంచు మనోజ్ కూడా బాలకృష్ణ సినిమాలో నెగటివ్ పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని మంచు విష్ణు కూడా ఒక సినిమాలో నటించటానికి రెడీగా ఉన్నాడని వీళ్ళ ముగ్గురు ఒక సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మరి ఫ్యూచర్ లో నందమూరి బాలకృష్ణ తో సినిమాలు చేస్తారా లేదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: