పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరో లుగా తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమా కి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్నాడు, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కోషియాన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. భీమ్లా నాయక్ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను, పోస్టర్ లను టీజర్ లను,  పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలను కూడా అమాంతం పెంచేశాయి, ఇలా ఇప్పటికే జనాల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా నుండి మరో సాంగ్ ను విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం భీమ్లా నాయక చిత్ర బృందం ఈ సారి విడుదల చేసే పాట ను పవన్ కళ్యాణ్ వాడినట్లు తెలుస్తోంది, పవన్ కళ్యాణ్ ఇది వరకే అజ్ఞాతవాసి సినిమా లో కొడకా కోటేశ్వర రావా అనే పాట పాడాడు. అయితే భీమ్లా నాయక్ సినిమా కోసం మరో సారి పవన్ కళ్యాణ్ ఒక పాట పాడు అని, ఆ పాటే అతి త్వరలో రిలీజ్ కాబోతుంది అని తెలుస్తోంది. ఇప్పటికే జనాల్లో ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన బిల్లా నాయక్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా విజయంతో మంచి ఊపు మీద ఉన్న పవన్ కళ్యాణ్ కు భీమ్లా నాయక్ సినిమా ఎలాంటి విజయాన్ని తీసుకు వస్తుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: