బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ క్రేజ్ అమాంతంగా పెరిగిన సంగతి మనకు తెలిసిందే. రమ్యకృష్ణ ఆ సినిమాలో లేకుండా మరో నటి ఆ పాత్ర పోషించి ఉంటే సినిమాలో ఆ పాత్ర అంత విజయవంతం అయి ఉండేది కాదు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు. రమ్యకృష్ణ ప్రస్తుతం తమిళ సినిమాలతో పాటు గా తెలుగు సినిమాల్లో కూడా బిజీ గా ఉండటమే కాకుండా నిర్మాతగా కూడా మారే ప్రయత్నం చేస్తోందని సీరియల్స్ లో కూడా నటించే ప్రయత్నం చేస్తోందని గతంలో కంటే ఇప్పుడు చాల బిజీ అయిపోయింది అని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుత రమ్యకృష్ణ తెలుగులో కొంత మంది అగ్ర హీరోల సినిమాల్లో కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉండటమే కాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా కాస్త తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. రమ్యకృష్ణ ప్రస్తుతం చేసే సినిమాలకు సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిటీ లేకపోయినా త్వరలోనే ఆమె మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించే సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం కనబడుతోంది. ఆ సినిమాలో చిరంజీవికి రమ్యకృష్ణ భార్యగా కనపడే అవకాశం ఉందని అయితే చిరంజీవి ఈ సినిమాలో రెండు పాత్రలను కనబడే అవకాశం ఉందని అంటున్నారు.

రమ్యకృష్ణ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కాస్త ఆసక్తికరంగా ఉన్నారని రెమ్యూనరేషన్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా సినిమా షూటింగ్ విషయంలో కూడా చాలా త్వరగా పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగు సినిమాల మీద దృష్టి పెట్టడం తెలుగు సినిమాల్లో అగ్ర హీరోలతో సినిమాలు చేయడం మాత్రం కొంతమంది నిర్మాతలను సంతోష పెడుతుంది. రాజకీయంగా చిరంజీవి నటించిన ఒక సినిమా లో కూడా రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ ఎక్కువ అడగడం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: