మన తెలుగు సినిమాల్లో గత కొన్ని రోజులుగా మాజీ హీరోయిన్ల హవా ఎక్కువగా ఉంది అనే మాట వాస్తవం. అగ్ర దర్శక నిర్మాతలు అలాగే అగ్ర హీరోలు తమ సినిమాల్లో మాజీ హీరోయిన్లు ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో వాళ్లకు ఎక్కువగా డిమాండ్ వచ్చింది. చాలామంది స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో కాస్త ఈ ప్రయత్నాలు చేయడంతో సినిమాల్లో వాళ్ళు కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే కొంతమంది మాజీ హీరోయిన్ల విషయంలో మాత్రం కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది కొంత మంది హీరోలకు.

వాళ్లు ఏ సినిమాలో నటించిన సరే సినిమా ఘోరంగా విఫలం కావడంతో చాలా మంది హీరోలు వాళ్లను వద్దని చెప్పడం అనేది ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా జరుగుతున్న పరిణామం. ప్రధానంగా ఖుష్బు విషయంలో టాలీవుడ్ లో చాలా మంది హీరోలు భయపడుతున్నారని ప్రధానంగా మెగా హీరోలు ఈ పేరు చెపితే చాలు భయపడిపోతున్నారు అని కొంతమంది అంటున్నారు.ఖుష్బూ గతంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టాలిన్ సినిమాలో నటించగా సినిమా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది.

ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో ఆమె నటించిన సినిమా కూడా ఘోరంగా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఆమె విషయంలో కాస్త మెగా హీరోలు ఆలోచనలో పడ్డారు అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో ఖుష్బూ  కీలక పాత్ర ఇవ్వాలని భావించిన సరే గత చరిత్రను గుర్తు పెట్టుకొని ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించలేదని ప్రచారం కూడా ఎక్కువగానే ఉంది. మరి భవిష్యత్తులో ఖుష్బూ  తెలుగు సినిమాల్లో నటిస్తుందా లేకపోతే తెలుగు సినిమా నుంచి దూరంగా వెళ్తారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాలి.మరి దీనిపై ఖుష్భు క్లారిటీ ఇస్తే నిజమో కాదో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: