తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన సినిమాలకు సంబంధించి అంచనాలు ఏ రేంజిలో ఉంటాయి అనే మాట వాస్తవం. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా విడుదల అవుతుంది అంటే చాలు అభిమానులు మొదటి రోజు సినిమా చూడటానికి చాలా ఆసక్తి కరం గా ఉంటారు. అంతేకాకుండా రా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు ఎప్పటికీ కూడా పాత సినిమాలను చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో పాత హీరోయిన్ లకు కీలక పాత్రలు ఇచ్చిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.

భవిష్యత్తులో  త్రివిక్రమ్ చేయబోయే సినిమాలకు సంబంధించి కూడా కొంతమంది పాత హీరోయిన్లను సెలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం కొంతమంది విషయంలో అతను వెనక్కి తగ్గారు అని అజ్ఞాతవాసి సినిమా తర్వాత అతను పాత హీరోయిన్ లకు సంబంధించి అంత ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. అజ్ఞాతవాసి సినిమాలో కుష్బూ తీసుకోగా ఆ పాత్ర పెద్దగా హిట్ కాకపోవడమే కాకుండా ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేయడంతో నిర్మాత కూడా ఇబ్బంది పడ్డారు అని ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలోనే తర్వాత సినిమాల విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడని అందుకే మాజీ హీరోయిన్ల విషయంలో అంతగా ఆసక్తి కరంగా లేదని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించే మాజీ హీరోయిన్లను పక్కన పెట్టడం పట్ల కాస్త అభిమానులు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. అరవింద సమేత సినిమాలో కూడా అతను మాజీ హీరోయిన్లను తీసుకునే ప్రయత్నం చేయలేదు. మరి భవిష్యత్తులో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: