అయితే ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించి దగ్గుబాటి రానా కాస్త ఆసక్తికరంగా ఉన్నారు అని దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తాన్ని ఒక సినిమాలో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో ముందుకు వెళ్లాలని ఆయన భావిస్తుండగా దీనికి సంబంధించి సురేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.
దీనికి సంబంధించి రానా ఇప్పటికే నాగచైతన్యతో కూడా మాట్లాడాడు అని త్వరలోనే దీనికి సంబంధించి పనులు కూడా మొదలయ్యే అవకాశం ఉందని ఈ సినిమాలో వెంకటేష్ రానా అలాగే రా నా సోదరుడు అభిరాం... నాగచైతన్య కనపడే అవకాశం ఉందని అలాగే అక్కినేని ఫ్యామిలీ కూడా కొంతమందిని చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రావచ్చని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ సినిమా మాత్రం కాస్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి భవిష్యత్తులో ఈ సినిమాను ఎలా ముందుకు తీసుకురాబోతున్నారు అసలు దీనికి దర్శకత్వం నిర్మాణ సారథ్యం ఎవరు వహిస్తారు అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాలి.