తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న సంగతి అందరికి తెల్సిందే. ఈ సినిమాను ముందుగా సెప్టెంబర్‌, అక్టోబర్ లోనే ఈ సినిమా ను విడుదల చేసేలా ప్లాన్ చేశారు. అయితే ఒక్కవైపు కరోనా, పవన్ రాజకీయ మీటింగ్‌ లు మరియు పర్యటనలు ఇలా పలు కారణాల వల్ల డిసెంబర్‌ వచ్చినా చిత్రీకరణ జరుగుతూనే ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ రెండవ వారం వరకు ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాకి డిసెంబర్ మూడవ వారంలో పవన్ డబ్బింగ్‌ చెప్పనున్నట్లు సమాచారం అందింది. డబ్బింగ్ అయిపోగానే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతాయి. అయితే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ ఇప్పట్లో లేదని చెబుతున్నారు. అంతేకాక.. గత నెలలో చిత్ర యూనిట్‌ సభ్యులు డిసెంబర్ నెలలో కనీసం 20 రోజుల పాటు చిత్రీకరణ చేస్తామని వెల్లడించిన సంగతి తెల్సిందే. కానీ ఇప్పుడు 20 రోజులు ఏమో కాని ఒక్క రోజు కూడా షూటింగ్‌ జరిగే అవకాశాలు లేవని ఇండస్ట్రీ వర్గాల చెప్పుకొస్తున్నారు.

ఇక మరోవైపు భీమ్లా నాయక్ మరీ ఆలస్యం కావడంతో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కు మరింత సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతి తర్వాత హరి హర వీరమల్లు సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉందని సమాచారం. కాగా.. ఈ సినిమా గురించి సమ్మర్‌ లో అంటూ అధికారికంగా ప్రకటన చేయనున్నారు. అంతేకాక.. ఈ సినిమాను ఖచ్చితంగా జనవరిలో మొదలు పెట్టి మార్చిలో పూర్తి చేస్తారని సమాచారం. పవర్ స్టార్ పవన్ తో క్రిష్ చేస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా ఓ రేంజ్ లో పవన్ అభిమానులకు థ్రిల్ ను కలిగిస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ నటిచనున్నది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ కనిపించనున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: