నాగార్జున హోస్ట్ గా చేస్తున్న తెలుగు తాజా షో బిగ్ బాస్ సీజన్ 5. అయితే 12 వ వారం ఎలిమినేషన్లో భాగంగా రవి ఎలిమినేట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న యాంకర్ రవి వరుస ఇంటర్వ్యూలలో  పాల్గొంటున్నాడు. అయితే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో రవి మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక సాధారణ రవి గా మాత్రమే వెళ్లానని యాంకర్ రవి గా వెళ్లలేదని చెప్పుకొచ్చాడు. ఈ షో తర్వాత చాలా మంది అభిమానులకు నేను దగ్గరయ్యాను అంటూ అంతేకాకుండా నేను ఇంత వరకు వస్తానని ఊహించలేదు నాకు ఎన్ని ఓట్లు వేస్తారు అని ఎప్పుడు అనుకోలేదు అని చెప్పుకొచ్చాడు.

 బిగ్ బాస్ షో  తర్వాత మంచి పాపులారిటీ వచ్చింది. బిగ్ బాస్ షో లో టాప్ 5 నేను ఉంటానని అనుకున్నానని కానీ అనుకోని విధంగా నేను బయటకు వచ్చేసాను అని చెప్పుకొచ్చాడు. రవి ఇంకా కాల్ అందరూ లాస్ట్ వరకు నామినేషన్ ప్రక్రియ లో ఉండడంతో కాజల్ ఎలిమినేట్ అవుతుంది అని ఆమె భావించినట్లు చెప్పాడు. ఇక విషయానికి వస్తే బిగ్ బాస్ షో వెళ్ళక ముందు నుంచి తనకి ఇంకా నట్రాజ్ మాస్టర్ కి మంచి పరిచయం ఉందని తెలిపారు. బిగ్ బాస్ షో కంటే ముందే తను ఇంకా నట్రాజ్ మాస్టర్ ఇద్దరు కలిసి కొన్ని షోలను అలాగే మరికొన్ని ఈవెంట్లను వారిద్దరూ కలిసి చేసినట్లు యాంకర్ రవి తెలిపారు. ఇకపోతే బిగ్ బాస్ షో లో రవి కి మాస్టర్ కి జరిగిన కొన్ని గొడవల విషయం అందరికి తెలిసిందే.

 అయితే నట్రాజ్ మాస్టర్ రవి చెడకొడుతున్నాడని తను ఊహించుకొని రవి అలా మాట్లాడినట్లు గొడవ పడినట్లు చెప్పాడు. రవికి నటరాజ్ మాస్టర్ కి అలా గొడవలు జరగడం వల్లనే రవి కి మాస్టర్ గుంటనక్క అని పేరు పెట్టినట్లు రవి తెలిపారు. తన పేరు పెట్టినంత మాత్రాన నేను అంగీకరించను అని చెప్పాడు. అయితే ఒకానొక సందర్భంలో సన్నీ కూడా రవి ఫేక్ అని చెప్పినా కూడా పెద్దగా ఫీల్ కాలేదని చెప్పుకొచ్చాడు. అయితే తన కంటే హౌస్ లో పింకీ ఇంకా మానస్ వీక్ గా  ఉన్నారని అది తన అభిప్రాయం అంటూ తన చెప్పుకొచ్చాడ. ఇంట్లో ఉన్న రోజుల్లో తను ఎలాంటి ఫేక్ గేమ్ ఆడలేదని తనకు ఫేక్ గేమ్ అంటే  కూడా తెలీదని... తనని ఎవరు నామినేట్ చేసిన కూడా  ఎప్పుడూ బాధ పడలేదని ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు రవి.

మరింత సమాచారం తెలుసుకోండి: