నట సింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ఈ టాక్ షో ప్రసారం అవుతోంది.నవంబర్ 4 దీపావళి సందర్భంగా ఈ టాక్ షోకి సంబంధించిన మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వగా.. బాలయ్య తన హోస్టింగ్ తో అదరగొట్టేసాడు.ఈ షోలో బాలయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా షోలో బాలయ్య స్టయిల్, మేనరిజం ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఇక ఈ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు లక్ష్మి హాజరు అవ్వగా.. ఆ తర్వాత సెకండ్ ఎపిసోడ్ కి న్యాచురల్ స్టార్ నాని వచ్చి సందడి చేసాడు.

ఇక ప్రస్తుతం మూడో ఎపిసోడ్ ని ప్రసారం చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ వారం మూడో ఎపిసోడ్ గెస్ట్ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.ఇక ఇదిలా ఉండగా తాజాగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా ఈ షోకి 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.దీంతో ఆహా టాక్ షోల లోనే అత్యధిక వ్యూస్ దక్కించుకున్న నంబర్ వన్ టాక్ షో గా అన్ స్టాపబుల్ సరికొత్త రికార్డు నెలకొల్పింది.దీంతో అటు ఆహా నిర్వహకులతో పాటు బాలయ్య బాబు ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు.మా బాలయ్య గారి వల్లే ఇది సాధ్యం అయింది,బాలయ్య మజాకా అంటూ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోపై పొగడ్తలు కురిపిస్తున్నారు.

ఇక ప్రస్తుతం బాలయ్య సినిమా విషయాలకొస్తే..బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన అఖండ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది. డిసెంబర్ 2 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ అందుకొని సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత, జగపతిబాబు, పూర్ణ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: