తెలుగులో తక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించినా నటిగా జయవాణి మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.ఒక ఇంటర్వ్యూలో జయవాణి మాట్లాడుతూ తాను మరియు వేణు మాధవ్ ఒకే సమయంలో కెరీర్ ను మొదలుపెట్టామని ఈ ఇండస్ట్రీలో ఎవరూ ఎవరికీ హెల్ప్ చేయరని తెలిపినట్లు సమాచారం.

సినిమా రంగంలో ఎవరి జర్నీ వారిదని మా అమ్మాయి అని చెప్పినా దర్శకుడికి నచ్చితేనే సినిమా ఆఫర్ ఇస్తారని జయవాణి కామెంట్లు చేశారని తెలుస్తుంది.. బాగా చేస్తారని మాత్రం చెప్పగలమని అంతకు మించి సహాయం చేయలేమని జయవాణి చెప్పుకొచ్చారట.సినిమా అనేది ఒక ప్రపంచం అని ఈ ఇండస్ట్రీలో అందరూ సెటిల్ కాలేరని జయవాణి తెలిపారని తెలుస్తుంది.సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే ఆ పిచ్చి ఉండాలని జయవాణి చెప్పుకొచ్చారట.. ఎప్పటికప్పుడు నేను అనేది తగ్గించుకుంటూ క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదగ గలమని జయవాణి అన్నారని తెలుస్తుంది.మా ఆయన సుందరయ్య అనే మూవీలో నటించే సమయంలో ఎవరితో మాట్లాడేదానిని కాదని ఆమె తెలిపారట.. మనోరమ తనతో ఎక్కువ సినిమాలు చేయాలంటే ఇండస్ట్రీలో అణుకువతో ఉండాలని చెప్పారని జయవాణి అన్నారట.అందరివాడు సినిమా షూటింగ్ లో తాను మూడు రోజులు పాల్గొన్నానని తన సీన్లు అన్నీ కట్ అయ్యాయని జయవాణి తెలిపారట.. కొన్ని సినిమాలకు రెమ్యునరేషన్ ఆలస్యమైనా తాను నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదని జయవాణి చెప్పుకొచ్చారని తెలుస్తుంది.

ఆంధ్రుడు సినిమాలో తాను నటించానని అయితే సునీల్ మరియు తన కాంబోలో వచ్చిన సీన్లు అన్నీ కట్ చేశారని జయవాణి వెల్లడించారని తెలుస్తుంది.. ఇండస్ట్రీ చాలా పెద్దదని ఆర్టిస్టులు చాలామంది ఉంటారని అందువల్లే కొన్ని సినిమాల్లో బోల్డ్ రోల్స్ లో నటించానని జయవాణి అన్నారని తెలుస్తుంది.. రాజమౌళి మంచిమంచి పాత్రలు ఆఫర్ చేస్తే తాను నో చెప్పలేకపోయానని జయవాణి చెప్పుకొచ్చారట.. పాత్రలు వేస్తూ వస్తేనే గుర్తింపు వస్తుందని జయవాణి వెల్లడించినట్లు సమాచారం అందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: