బాలయ్య బాబు హీరోగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఈ చిత్రం సక్సెస్ అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ చిత్రంగా నిలుస్తుంది.ఈ హై ఓల్టేజ్ మూవీ డిసెంబర్ 2వ తారీఖు న విడుదల కానుంది. ఈ మూవీలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించడం విశేషం . మరొక హీరోయిన్ పూర్ణ కూడా ఒక కీలక పాత్రలు పోషిస్తోంది. కరోనా తర్వాత విడుదలవుతున్న అత్యధిక భారీ బడ్జెట్ సినిమా కావడం తో ఈ మూవీపై మరింత అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమా థియేటర్ బిజినెస్ విషయానికొస్తే భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం..

1). సీడెడ్-11 కోట్ల రూపాయలు.
2). నైజాం-11 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-5. 80 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-3.95 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-3.44 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-5.48 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-3.82 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-1.89 కోట్ల రూపాయలు.
9).ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..46.38 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.
10). రెస్టాఫ్ ఇండియా-4.40 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్..2.47 కోట్ల రూపాయలు.
12). వరల్డ్ వైడ్ గా.. థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే ..53.25 కోట్ల రూపాయల వరకు జరిగింది.

అఖండ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..53.25 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరగగా.. ఇప్పటివరకు ఇంతటి అత్యధికంగా బిజినెస్ జరిగిన మూవీగా ఇదే ఉండటం గమనార్హం. ఇక ఈ మూవీ సక్సెస్ కావాలంటే..54 కోట్ల రూపాయలను కలెక్షన్ చేయవలసి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇటువంటి పరిస్థితుల వలన ఇక ఈ టార్గెట్ ను అందుకు ఉంటుందా లేదా తెలియదు. అయితే ఇంత కంటే ముందుగా గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది. ఒకవేళ ఆ సినిమా కలెక్షన్లను దాటితే ఇదే బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూలు చేసిన సినిమాగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: