హాట్ బ్యూటీ తమన్నా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ సినిమా విజయంతో టాలీవుడ్ లో క్రేజీ సినిమాల్లో నటించిన తమన్నా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమన్నా తమిళ్, హిందీ భాషల్లో కూడా హీరోయిన్ గా నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఇలా తన అందం తో, అభినయం తో, నటన తో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తోంది. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా తమన్నా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మెరుస్తోంది. తమన్నా ఇప్పటికే నవంబర్ స్టోరీ, లెవెన్త్  హవర్ అనే వెబ్ సిరీస్ లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇది ఇలా ఉంటే తమన్నా ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా తో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ గా నటించబోతోంది. ఇప్పటికే తమన్నా, మెగాస్టార్ చిరంజీవి తో సైరా నరసింహారెడ్డి సినిమా లో నటించింది, వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇలా వరుస సినిమాలతో, వెబ్ సిరీస్ ల తో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న తమన్నా తాజా గా ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు చిక్కింది.  ఎయిర్ పోర్ట్ లో సందడి చేసిన తమన్నా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో తమన్నా వైట్ డ్రెస్ ను ధరించింది. మరియు ఈ ఫోటోలలో తమన్నా తన హాట్ లుక్స్ తో కుర్రకారు మనసు దోచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: