కొంతమందికి కొన్ని హీరోల సినిమాలకు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. కొంతమంది నటన పరంగా కాకుండా.. అభిమానులకు కూడా కాస్త సెంటిమెంట్ లు ఉంటాయి. తాము ఇష్టపడే హీరో మూవీ విడుదల అయింది అంటే పలు రకాలుగా సెంటిమెంట్లు ను పాటించడం జరుగుతూ ఉంటుంది. అలా తమ హీరోల మూవీ సక్సెస్ కావాలనే ఉద్దేశంతోనే కొన్ని సెంటిమెంట్లను ఎన్నో సంవత్సరాలుగా పాటిస్తూ ఉంటారు.


అసలు విషయానికొస్తే.. ఏదైనా సినిమా ఈవెంట్ లో ఎవరైనా గెస్ట్ గా రావడం జరుగుతుంటుంది. ఇక ఆ ఈవెంట్లో.. వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందులో ఆ స్పెషల్ గెస్ట్ తోనే.. ఆ మూవీ కి సంబంధించి ఏదైనా పోస్టర్,వీడియోను విడుదల చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ మూవీ మంచి సక్సెస్ అందుకున్నట్లూ అయితే ఆ క్రెడిట్ అంతా ముఖ్య అతిథికే వెళ్ళిపోతుంది.ఇక ఆ తర్వాత ఇతర హీరోలు సైతం.. వారి యొక్క సినిమాల ప్రీరిలీజ్ వేడుకలకు..పిలుస్తూ ఉంటారు.


ఒకవేళ సినిమా ఏదైనా తేడా కొడితే.. ఆ హీరో రావడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయిందని అందరూ అంటూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఇలాంటి విషయం ఎక్కడా బయటికి రాలేదు.. కానీ తాజాగా ఒక విషయం మాత్రం ఇప్పుడు ఎక్కువగా వైరల్ గా మారుతోంది. ఇప్పుడు ఎక్కువగా ఒక పేరు వినిపిస్తూ వుండడం తో ఒక్కసారిగా అందరూ భయపడుతున్నారు. అతను ఎవరో కాదు ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్. ఈ హీరో వరుస సక్సెస్ లతో బిజీగా ఉన్నప్పటికీ.. కానీ కేవలం ఒక్క సినిమా వల్లే ఈ హీరో ఫ్లాప్ అని ముద్ర వేస్తున్నారు నెటిజెన్స్.

ఇక అసలు విషయానికి వెళ్తే.. అల్లు అర్జున్ ఎన్నో సినీ ఈవెంట్లకు ముఖ్యఅతిథిగా వెళ్లారు. శర్వానంద్ హీరోగా "పడి పడి లేచే మనసు" మూవీ కి ముఖ్య అతిథిగా హాజరైన విషయం మనకు తెలిసిందే. కానీ ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇక ఆ తరువాత చావు కబురు చల్లగా, వరుడు కావలెను వంటి సినిమాలకు కూడా వెళ్లగా అవి డిజాస్టర్గా మిగిలాయి. ఇప్పుడు అఖండ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో కనిపించారు. మరి ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: