విశ్వనట కమలహాసన్ గత కొద్ది రోజుల కిందట కరోనా పాజిటివ్ రావడంతో  ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హాస్పిటల్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు  అంటూ ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది.. నిజానికి కరోనా నుంచి కమలహాసన్ కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారా..? అతను ఇంటికి వచ్చినట్లు వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం.. తాజాగా ఆయన ఇంటికి చేరుకున్నట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తూ ఉండడంతో ఇందులో నిజమెంత అంటూ అభిమానులు ఆరా తీయడం గమనార్హం..ఇకపోతే ఈ ఫోటో కు సంబంధించిన ఈ విషయంపై కమలహాసన్ స్థాపించిన పార్టీ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ ప్రతినిధి మురళి అబ్బాస్ ఇలా వివరణ ఇచ్చారు.. ఆయన మాట్లాడుతూ.. కమలహాసన్ ఇంకా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాలేదు.. కానీ ఆయన ఆరోగ్యం బాగా కుదట పడుతుంది.. ముందుకంటే ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నారు.. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఫోటో ఎక్కడ నుంచి వచ్చింది అనే విషయం గురించి ఆరా తీస్తే గత రెండు సంవత్సరాల క్రితం అపోలో హాస్పిటల్ లో ఆయన పాదాలకు శస్త్రచికిత్స చేయించుకొని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తీసిన ఒక ఫోటో ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది కాస్తా వైరల్ గా మారింది.

గత నాలుగు రోజుల క్రితం ఆయన ఖాదీ బ్రాండ్ హౌస్ ఆఫ్ ఖద్దర్  లాంచ్ కోసం అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరారు. ఇక ప్రస్తుతం ఆయన చెన్నైలో శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని పార్టీ ప్రతినిధి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: