టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇవాళ మధ్యాహ్నం మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆయన ఎన్నో రకాల పాటలను రాశారు వాటిలో చాలా రకాల పాటలు ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇప్పటివరకు ఏ పాటలు రాశారో...ఇప్పుడు తెలుస్తుంది.

స్వయంకృషి లోని పాటలు, అలాగే రుద్రవీణ లోని నమ్మకు నమ్మకు ఈ రేయిని ఈ పాట రాశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.  ఇక ఈ పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. అలాగే స్వర్ణకమలం లోని అన్ని పాటలు ఆయనే రాశారు. ఇందులో ముఖ్యంగా ఆకాశంలో ఆశల హరివిల్లు అందెల రవమిది అనే పాట అందరినీ ఆకట్టుకుంది. శృతిలయలు లో కూడా తెలవారదేమో స్వామి అనే పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. అక్కినేని నాగార్జున నటించిన శివ సినిమాలో బోటని పాట ఉంది అనే పాటను కూడా ఆయన రాశారు. ఇక ఆ క్షణ క్షణం సినిమాలో... కో అంటే కోటి, జామురాతిరి జాబిలమ్మ అనే పాటను కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు.


ఇక గాయం సినిమాలో... అలుపన్నది ఉందా, నిగ్గదీసి అడుగు, పాటలు రాసి ఉన్నత శిఖరాలను అధిరోహించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. గులాబీ సినిమా లో.. ఏ రోజైతే చూశానో నిన్ను.. క్లాసు రూములో తపస్సు చేయుట వేస్టురా గురూ అనే రెండు పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. మనీ సినిమాలో... చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ, భద్రం బీ కేర్ ఫుల్ అనే పాటలను రచించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. శుభలగ్నం సినిమాలో చిలకా ఏ తోడు లేక, నిన్నే పెళ్ళాడుతా సినిమా లో కన్నుల్లో నీ రూపమే, నిన్నే పెళ్ళాడుతా తానంటూ అనే పాటలను రచించారు. సింధూరం సినిమాలోని అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. ఇంకా నువ్వేకావాలి సినిమా లో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అనే రెండు పాటలను రచించి జాతీయ ఉత్తమ అవార్డు అందుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: