ముఖ్యంగా చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమాలో నమ్మకు నమ్మకు ఈ రేయి అనే పాట ఎంతో హిట్ అందుకున్నది. 1988లో వచ్చిన రుద్రవీణ చిత్రంలో సిరివెన్నెల ఈ పాటను రాసారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడు, సిరివెన్నెల సాహిత్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం, కే.బాలచందర్ దర్శకత్వంలో కె.నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు రుద్రవీణ చిత్రానికి. సిరివెన్నెల పేరు వినగానే తొలుత క్లిక్ అయ్యే సాంగ్ రుద్రవీణలోని నమ్మకు నమ్మకు ఈ రేయి.. ప్రారంభమయ్యే సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి వెచ్చనైన ఊసులన్ని రెచ్చగొట్టు సీకటి అనే సాంగ్ ఎంతో ప్రాచుర్యం పొందింది.
అందులో ముఖ్యంగా నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి కలలే వలగా విసిరే చీకట్లను చీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి అనే సాగే ఈ పాట ఓ ఊపు ఊపింది. ఇప్పటికీ ఎంతో మంది మెగస్టార్ అభిమానులు ఈ పాటను వింటుంటారు. ఈ పాట దక్కిన హిట్ అంతా ఇంతా కాదు. అదేవిధంగా నమ్మకు నమ్మకు ఈ రేయి అని సాగే ఈ పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.