తెలుగు సినిమా సాహిత్యంపై సిరివెన్నెల కురిపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు. ఆయన ఈ రోజు కిమ్స్ ఆసుపత్రిలో 66 ఏళ్ల సంవత్సరాల వయసులో మరణించారు. ఇప్పటికే ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ మరణాన్ని సినీ అభిమానులు ఇంకా మరిచిపోకముందే విస్మరించకముందే ఇంతలోనే ఈ ప్రఖ్యాత గేయ రచయిత మరణించడం ఒక్కసారిగా అందరికీ శోకసంద్రంలో కి తీసుకు వెళ్ళింది. ఆయన గత కొంత కాలంగా న్యూమోనియా అనే వ్యాధి తో బాధపడుతు ఉండగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో కొన్ని రోజుల క్రితం చేరి చికిత్స పొందుతున్నారు.

కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈ రోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నెల 24వ తేదీన ఆయన కుటుంబ సభ్యులు అనారోగ్యం గా ఉన్న ఆయన్ని ఆస్పత్రిలో చేర్చగా అప్పటి నుంచి ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోనే ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో  చికిత్స తీసుకుంటూ వచ్చారు. అయినా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తూ వచ్చింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ వారు ఆయన ప్రాణాలను నిలబెట్టలేకపోయారు.

ఊపిరితిత్తులలో నిమ్ము అధికంగా చేరుకోవడంతో ఆయన ఊపిరి పీల్చుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు అని వారు వెల్లడించారు. ఆయన మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గొప్ప గొప్ప రచయితల సరసన చేరారు.  అలా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని గొప్ప గొప్ప రచనలు చేసిన ఈ సాహితీకారుడు ఇప్పుడు కాలం ఆడే ఆటలో ఓటమి చెంది మరణించక తప్పలేదు. మరణం ఆయన్ని తీసుకుపోయిన అయన తన పాటల రూపంలో ఎప్పుడు బ్రతికే ఉంటాడు.. భవిష్యత్ తరం వారు అయన గురించి చెప్పుకునే ఎన్నో గొప్ప పాటలను అయన రాసి దివికేగాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: