నటుడు జగపతి బాబు "గాయం" చిత్రం లో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే పాట గుర్తుండే ఉంటుంది అందరికి. అప్పట్లో నే కాదు ఇప్పుడు విన్నా కూడా ఆ పాటకు అదే స్పందన వస్తుంది. అంటే పాట వింటే చాలు రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. అలాంటి పాటలు అందరు రాయలేరు. అలా రాసే కొద్ది మందిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒకరు. అలాంటి పాటలు ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో ఉన్నాయి. సమాజం పట్ల తన బాధ్యతను ఇలా తీర్చుకున్న వారు ఉన్నారు. ఎవరికి ఎలా వీలైతే అలా సమాజ సేవ చేస్తారు. కానీ సినీ పరిశ్రమ ద్వారా ఈ స్పందన భారీగా తేవచ్చు. అందుకే ఎన్నో ప్రజా విప్లవాలకు సినీ పరిశ్రమలో కూడా పునాదులు పడ్డాయి. గతంలో కూడా ఏదైనా ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన విషయం ఉంటె దానిని పాట రూపంలోనో లేదా నాటకం రూపంలోనో తీసుకెళ్లేవారు. అలా చెప్పడం ద్వారా తొందరగా ప్రజలకు విషయం అర్ధం అవుతుంది, అప్పుడు వారు స్పందించాల్సిన రీతిలో స్పందిస్తారు.

శాస్త్రిగారి పాటలు కూడా అలా ఉండేవి. అయితే వాటి ప్రభావం ఉన్నదా లేదా అనేది తరువాత విషయం కావచ్చుగాక. అయన వంతు కృషి ఆయన చేశారు, అంతవరకూ స్పష్టమైన నిజం. అలాగే ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు ఆయన పాటలు అందించారు. వాటిలో విధాత తలపున అనే పాట కావచ్చు, ఆదిభిక్షువును ఏది అడిగేది అనే పాట కావచ్చు(నంది అవార్డు). అలాగే కొన్ని చిత్రాలు స్వయం కృషి, స్వర్ణకమలం శృతిలయలు వంటి గొప్ప చిత్రాలకు పాటలు అందించారు. అందులో అందెలరవమిది పదములదా అనే పాటకు మరో నంది అవార్డు దక్కింది. మూడు సార్లు వరుసగా(1986,87,88) నంది అవార్డు పొందిన వారుగా ఆయన పేరుగాంచారు. 1993లో గాయం చిత్రం మరోసారి గొప్ప విజయాన్ని శాస్త్రి గారికి తెచ్చిపెట్టింది.

అగ్ర నటుల నుండి అందరికి ఆయన పాటలు రాశారు. అందరికి విజయాలు అందించారు. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ తరం నుండి మహేష్, ఉదయ్ కిరణ్, తరుణ్ తరం వరకు అందరికి ఆయన పాటలు రాశారు. మహేష్ బాబుతో చేసిన ఒక్కడు చిత్రంలో హరేరామ, నువ్వే కావాలి లోని ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి ఆకాశం తాకేలా(ఫిలిం ఫేర్) పాట, ప్రభాస్ చిత్రం చక్రం లో జగమంతా కుటుంబం అనే పాట లు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టాయి. జగమంతా కుటుంబం పాటతో ఆయన 9వ నంది అవార్డు అందుకున్నారు. గమ్యం చిత్రంలో ఇంతవరకు అనే పాటకు రెండో ఫిలిం ఫేర్, ఎంతవరకు పాటకు పదో నంది అందుకున్నారు.  ఇలా చెప్పుకుంటూ పోతే విజయపరంపర చెప్పుకునే వయసు రాసేవారికి సరిపోదు కావచ్చుగాక. 2019లో పద్మశ్రీ సహా 11 నంది అవార్డులు, నాలుగు ఫిలిం ఫేర్ లు సహా పలు ఇతర అవార్డులు ఎన్నో అందుకున్నారు. ఈ ప్రయాణంలో ప్రతి పాట ఒక మేలుకొలుపే.

మరింత సమాచారం తెలుసుకోండి: