అక్కినేని నాగార్జునకు మంచి హిట్ వచ్చి చాలా రోజులు అయిపోయిందని చెప్పవచ్చు. ఆయన తోటి సీనియర్ హీరోలు సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతుంటే నాగార్జున మాత్రం పేలవమైన సినిమాలు చేసి అభిమానులను నిరాశ పరుస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా తో ఆయన పర్వాలేదనిపించాడు కానీ ఆయన స్థాయి లో ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేకపోయింది. దాంతో ఆయన తన సినిమాలతో హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది.

ఫ్యాన్స్ కూడా ఎంతో ఆకలితో ఉన్నారు. దాంతో ఆయన తదుపరి చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఇటీవల కాలం లో భారీ హిట్ కొట్టిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది సోగ్గాడే చిన్నినాయన అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆయన ఏ చిత్రంతో కూడా ఇంతటి స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఆ విధంగా నాగార్జున ఇప్పుడు చేస్తున్న బంగార్రాజు సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉండగా ఇది సంక్రాంతికి విడుదల కాబోతోంది. మరి దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఘోస్ట్ అనే చిత్రం వచ్చే సంవత్సరం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని అంటున్నారు. అలా రెండు తెలుగు సినిమాల తో నాగార్జున వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోందా ఆయన చేసిన హిందీ చిత్రం బ్రహ్మాస్త్రం కూడా వచ్చే సంవత్సరం సెకండాఫ్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ రణబీర్ కపూర్ ముఖ్య పాత్రలో నటించగా కూడా ఓ కీలక పాత్రలో నాగార్జున దర్శనమివ్వనున్నారు.  ఇలా మూడు సినిమాలతో నాగార్జున ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా వీటి ఫలితాలు ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తాయి చూడాలి. మరి ఈ ట్రిపుల్ ధమాకా ఏ రేంజ్ లో పేలుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: