అందాల ముద్దు గుమ్మ రాశి కన్నా నాగశౌర్య హీరో గా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు రాశి కన్నా నటనకు, అంద చందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ హాట్ బ్యూటీ  కి తెలుగు నాట క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా టాలీవుడ్ లో క్రేజీ సినిమాల్లో నటించిన రాశి కన్నా టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, ప్రస్తుతం రాశి కన్నా కూడా  నాగ చైతన్య హీరో గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా తో పాటు గోపీచంద్ హీరో గా మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పక్క కమర్షియల్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది, వీటి తో పాటు రాశి ఖన్నా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

 ఇది ఇలా ఉంటే ఈ రోజు ముద్దు గుమ్మ రాశి ఖన్నా పుట్టిన రోజు. రాశి కన్నా పుట్టిన రోజు సందర్భం గా రామ్ పోతినేని , రాశి ఖన్నా కు సోషల్ మీడియా వేదిక గా ప్రత్యేకం గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేశాడు. రామ్ పోతినేని హీరో గా తెరకెక్కిన హైపర్ , శివమ్ సినిమా లో రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే పక్కా కమర్షియల్ చిత్ర బృందం కూడా రాశి కన్నా పుట్టిన రోజు సందర్భం గా  ఒక వీడియో ను సోషల్ మీడియా వేదిక గా బయటకు వదిలింది, ప్రస్తుతం ఈ వీడియో కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: