లండన్ మహానగంలో ఆ రోజు చాలా సందడిగా ఉంది. మెడుకు బిగుతుగా బిగించుకుున్న టైలతో  తిరిగే అక్కడి జనం అంతా కూడా అక్కడ గుమిగూడి ఉన్న దాదాపు రెండు వందల మందికి పైన్న పురుషులు, మహిళలను. వారి దుస్తులు,వారి వేషధారణను చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ... తమలో తాము  మాట్లాడుకుంటా వెళ్లిపోతున్నారు. లండన్ లో నివాసమున్న వారికి పూర్తిగా కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా ఉంది. అక్కడ కొద్ది సేపట్లో ఆరంభం కానున్న తెలుగు మహాసభలకు విచ్చేసిన వారు ఆహూతులకు సాదర స్వాగతం పలికేందుకు అక్కడ రోడ్డుపై గుమికూడారు. ఇది  2014 సంవత్సరం సెప్టెంబర్ నాటి ముచ్చట. తేదీలు అంతగా గుర్తు లేదు కానీ, బహుశా 27, 28 తేదీలు కావచ్చు.  ఆ మహా నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తో పాటు స్థానికంగా ఉండే యుక్త సంస్థలు సంయుక్తంగా తెలుగు మహా సభలు జరిగాయి.
తొలి రోజు సభా కార్యక్రమం  మాతెలుగు తల్లికి మల్లేపూదండ గేయంతో ఆరంభమైంది. ఈ సభలకు ఇంగ్లాండ్, అమెరికా, ప్రాన్స్ , జర్మనీ దేశాలనుంచి తెలుగు సాహిత్యాభిలాషులు, సాహితీ వేత్తలు హాజరయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులుగా  ఉపముఖ్యమంత్రి కె.ఇ కృష్ణమూర్తి,  శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ లు హాజరయ్యారు. దేశ విదేశాలలో ఎక్కడ తెలుగ సభలు జరిగినా తప్పక హాజరయ్యే  సాహితీ ప్రముఖుడు, పద్మశ్రీ యార్లగడ్డ  లక్ష్మీ ప్రసాద్ కీలకోపన్యాసం చేశారు.
తెలుగు సినీ రంగానికి చెందిన రచయితలు చాలా మంది ఈ సభలకు విచ్చేశారు.  వారి ప్రసంగాలను మించి  సీతారామ మూర్తి ప్రసంగా సాగించి.  సీతారామ శాస్త్రి  మైక్ తీసుకుని మాట్లాడుతున్నారా ? తెలుగు వారితో సంభాషిస్తున్నారా ? లేక సభకు హాజరైన వారితో  అష్టావధానం చేస్తున్నారా ? అన్నట్లుగా సాగింది ఆయన ప్రసంగం.  ఆద్యంతం హాస్యభరితంగా సాగినా ఎక్కడ లింక్ తెగిపోకుండా ఆయన ప్రసంగ పాఠం సాగిందని కార్యక్రమ నిర్వహకులు ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు సాహిత్య చరిత్రలో మరో సువర్ణాధ్యయనాన్ని లిఖించారని సీతారామ శాస్త్రిని పొగడ్తలతో ముంచెత్తారు.తెలుగు తనానికి వన్నె తెచ్చిన బాబు- రమణల స్నేహితాన్ని,  రామ లక్ష్మణుల అనుబంధాన్ని వివరించారు. అదే సమయంలో అదే సభలకు హాజరైన రచయితలు అశోక్ తే, జొన్నవిత్తుల, తనికేళ్ల భరణి లతో తనకున్న అనుబంధాన్ని సీతారామ శాస్త్రి  వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: