సినీ ఇండస్ట్రీలో గత రెండు సంవత్సరాల నుంచి వరుసగా విషాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది ప్రముఖులు మరణించడం వల్ల కోలుకోలేని విధంగా తయారవుతోంది సినీ ఇండస్ట్రీ. ఒక మరణం తరువాత మరొకరు మరణించడం జరుగుతోంది. గత సంవత్సరం ఎస్పీ బాలు గారు మరణించగా.. ఇక ఇంతలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా అనూహ్యంగా మరణించడం జరిగింది. ఈ విషాద ఛాయలు కేవలం తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో సైతం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం లో ఎంత మంది సినీ ప్రముఖులు దూరమయ్యారు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


1). సిరివెన్నెల సీతారామశాస్త్రి:

ఈయన లిరిక్ రైటర్ గా ఎంతో గొప్ప పేరు పొందారు.. ఈయన నవంబర్ 30 తేదీన మరణించడం జరిగింది.

2). శివ శంకర్ మాస్టర్:

తన కెరియర్ లోనే ఎన్నో అత్యధిక  సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు శంకర్ మాస్టర్. ఈయన  నవంబర్ 28 న మరణించారు.

3). పునీత్ రాజ్ కుమార్:

కన్నడ లో తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యపోతారు.. ఇక ఈ హీరో కూడా అక్టోబర్ 29వ తేదీన మరణించారు.

4).TNR :

జర్నలిజం లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు TNR . ఇక ఈయన కూడా ఒక నటుడే.. ఈయన మే 10వ తేదీన మరణించారు.

5). మహేష్ కత్తి:

జర్నలిస్టుగా, నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు కత్తి మహేష్.. ఈయన జూలై 10వ తేదీన మరణించారు.

6). మహేష్ కోనేరు:

నిర్మాతగా ఎన్నో సినిమాలకు వ్యవహరించారు ఈయన.. ఈయన అక్టోబర్ 12వ తేదీన మరణించారు.

7). వివేక్:

తెలుగులో కామెడీ అనగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వివేక్.. ఈ నటుడు ఏప్రిల్ 17వ తేదీన మరణించడం జరిగింది.

ఇక్కడ వీరే కాకుండా వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, ఆర్ ఆర్ వెంకట్ నిర్మాత, కె.వి.ఆనంద్ సినిమాటోగ్రాఫర్, బి ఏ రాజు నిర్మాత.. మరికొందరు కూడా మరణించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: