సాహితీ హిమాలయం సీతారాముడు..
- ఇళయ రాజా.

వ్యాపారాత్మక సిని మా పాట ల్లో సైతం... కళాత్మక తని, కవితాత్మని అందిం చి.. తనదైన ముద్ర తో
అందమైన, అర్థవంత మైన,
సమర్థవంత మైన పాట లని
మన మెదళ్లలోకి జ్ఞానగంగ లా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు...

ఎన్నో సంవత్సరా ల ప్రయాణం మాది , శ్రీ వేటూరి గారి కి సహాయ కుడి గా వచ్చి.. అతి తక్కు వ కాలం లో.. శిఖర స్థాయి కి చేరుకున్న  సరస్వతీ పుత్రుడు...
మా ఇద్దరి కలయిక లో ఎన్నో పాట లు ప్రాణం పోసుకున్నాయి.. తన పాటల "పదముద్రలు " నా హార్మోనియం మెట్ల పై నాట్యం చేశాయి... రుద్రవీణ , స్వర్ణ కమలం , బొబ్బిలి రాజా
ఎన్ని సినిమా లు , ఎన్ని పాట లు.. రేపు రాబోయే
" రంగ మార్తాండ " కూడా..
సీతారాముడు  రాసిన పాట లకు నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ సంగీతాన్ని అందించిన సందర్భా లెన్నో.!
సీతారాముడు
పాట తో ప్రయాణం చేస్తా డు
పాట తో అంతర్యుద్ధం చేస్తా డు...
పాట లో అంతర్మథనం చెందుతాడు..
పాట ని ప్రేమిస్తాడు...
పాట తో రమిస్తాడు...
పాట ని శాసిస్తాడు...
పాట ని పాలిస్తాడు.. పాట నిస్తా డు..
మన భావుకతకి భాష ను అద్ది. మనకు తెల్సిన పాట లా చెవుల్లో కి ఒంపుతాడు.. అందు కే
సీతారాముడి పాటలు ఎప్పటికీ  గుర్తుం టాయి...
తన సాహిత్యం
నాతో ఆనంద తాండవం చేయించాయి
నాతో శివ తాండవం చేయించా యి...
"వేటూరి"  
నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమ ను పెంచి తే..
"సీతారాముడు"  
నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవా న్ని పెంచాడు...
ధన్యోస్మి మిత్రమా..!
ఇంత త్వర గా  సెలవంటూ
శివైక్యం చెందడం మనస్సు కు బాధ గా ఉంది...
"  పాట కోసమే బ్రతికావు,
బ్రతికినంత కాలం పాటలే రాసావు..
ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాల ని కోరుకుంటున్న..

.........ఇళయ రాజా

మరింత సమాచారం తెలుసుకోండి: