కరోనా సెకండ్ వేవ్ త‌ర్వాత ఇప్పుడిప్పుడే సినిమా ఇండ‌స్ట్రీ గాడిలో ప‌డుతోంది. సెప్టెంబ‌ర్‌లో వ‌చ్చిన ల‌వ్‌స్టోరీ సినిమాతో బాక్సాఫీస్‌కు కాస్తంత ఊపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ కూడా ఇండ‌స్ట్రీకి కాస్తంత ఊపు తెచ్చింది. ఈ రెండు నెలల్లో విడుద‌ల అయిన మ‌రికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ కు ఊపిరి పోసాయి.

ఇక న‌వంబ‌ర్ నెల‌లో మాత్రం టాలీవుడ్ లో ఏకంగా ఆరేడు సినిమాలు వ‌చ్చినా అవేవి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ లేక‌పోయాయి. దీపావళి కానుకగా నవంబర్ ఫస్ట్ వీక్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన అన్నాత్తే ( తెలుగులో పెద్ద‌న్న ) సినిమా వ‌చ్చింది. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. కేవ‌లం ఫ‌స్ట్ డే వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా ఆ త‌ర్వాత పూర్తి గా తేలిపోయింది.

ఆ త‌ర్వాత ఎనిమీ వ‌చ్చింది. అది కూడా కేవ‌లం ఫ‌స్ట్ డే వ‌సూళ్ల త‌ర్వాత తేలిపోయింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన రాజా విక్ర‌మార్క  కూడా బాక్సాపీస్ ద‌గ్గ‌ర ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. అయితే పుష్ప‌క విమానం సినిమాకు మంచి టాక్ వ‌చ్చినా కూడా క‌మ‌ర్షియ‌ల్ గా అయితే వ‌సూళ్లు రాలేదు. నవంబర్ 19న ఒకే రోజు దాదాపు పది చిన్న సినిమాలు వ‌చ్చాయి. అవి అస‌లు ఎప్పుడు వ‌చ్చాయో ఎప్పుడు వెళ్లాయో కూడా ఎవ్వ‌రికి తెలియ‌దు.

ఇక అనుభ‌వించు రాజా, క్యాలీఫ్లవర్ - ది లూప్ సినిమా కూడా తొలి రోజు సంద‌డి చేసినా త‌ర్వాత తేలిపోయాయి. ఇలా న‌వంబ‌ర్ నెల మొత్తం అంతా బాక్సాఫీస్ కు పెద్ద పీడ‌క‌ల గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఆశ‌లు అన్ని డిసెంబ‌ర్ మీదే ఉన్నాయి. బాల‌య్య అఖండ‌, బ‌న్నీ పుష్ప‌, నాని శ్యామ్ సింగ రాయ్ - గుడ్ లక్ సఖీ - లక్ష్య - మరక్కార్ - స్పైడర్ మ్యా - నో వే హోమ్ - 83 - మడ్డీ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మ‌రి ఇవి అయినా హిట్ అవుతాయేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: