5 ఏళ్ల క్రితం మొదలైన మీటు అంటూ ఉద్యమం వల్ల ఎంతో మంది నటిమనుల జీవితంలో కొత్త వెలుగును నింపిందని చెప్పవచ్చు. దీనివల్ల సినీ ఇండస్ట్రీలో ఉండే  నటీమణుల పైన జరిగే లైంగిక వేధింపుల కేసు విషయాలు కాస్త తగ్గాయని చెప్పవచ్చు. దీని కారణంగా ఎంతో మంది హీరోయిన్స్ తమ తమ బాధలను మీడియా ముందుకు వచ్చి వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇలాంటి విషయంపై ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో తెలియక సినీ ఇండస్ట్రీలో భయం భయం గా ఉంటున్నారు. అయితే ఇలాంటి విషయాలలో కొంతమంది హీరోలు చాలా ఇబ్బంది పడ్డారు. మరికొంతమంది కోర్టు వరకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అలాంటి వాటిలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఒకరు.


మూడేళ్ల క్రితం అర్జున్ పై ఒక లైంగిక వేధింపు కేసులో హీరోయిన్ శృతి కేసు వేసింది. అయితే ఈ కేసుపై హీరో హాజరు కావాల్సి ఉండగా.. హీరోయిన్స్ శృతి తెలుపుతూ షూటింగ్ పేరుతో అర్జున్ తన ఒంటిపై చేతులు వేశారని ఆమె దీంతో చాలా ఇబ్బంది పడ్డాను అంటూ ఆ కేసులో ఆరోపించింది. అంతే కాకుండా షూటింగ్ వంటి పేరుతో ఎన్నో సార్లు తనను వేధించారని ఆమె ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అయితే ఈ కేసును కోర్టు పరిశీలించిన అనంతరం సాక్ష్యాలు లేకపోవడంతో పోలీసులు కేసు కొట్టి వేయడం గమనార్హం.

ఇక హీరోయిన్ శృతి హరిహరన్ తన వద్ద ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా అర్జున్ పై ఫిర్యాదు చేసింది అంటూ పోలీసులు తెలియజేశారు. ఇక అర్జున్ ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించారు, అంతే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోలకు మల్టీ స్టారర్ మూవీలో కూడా నటించాడు. ఇక ఎంతో మంది అభిమానులను కూడా కూడగట్టాడు ఈ హీరో. అయితే ఆయన ఇలా చేశారని విషయం అభిమానులు  చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా ఆయన నిర్దోషిగా బయటపడటంతో ఆనందం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: