ప్రస్తుత పరిస్ధితుల బట్టి ఈ వార్తనే నిజం అనిపిస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నో ఆశలతో ఎంతో కష్టపడి దాదాపు మూడు సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న చిత్రం "రణం రౌద్రం రుధిరం". కోట్లాది మంది ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా లో ఇద్దరు టాప్ సీనియర్ హీరో వారసులు అయిన యంగ్ టైగర్ నందమూరి ఎన్టీఆర్, అలాగే మెగా పవర్ స్టార్ మెగా వారసుడు రాం చరణ్ హీరోలుగా నటించడం సినిమాకే ఓ హైప్ తీసుకొచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రియ శరన్ కి ఓ లీడ్ రోల్ చేయించారు రాజమౌళి.

అంతేనా ఓ పీరియాడికల్ సినిమాగా  వస్తున్న ఈ మూవీలో  బాలీవుడ్ కింగ్ అజయ్ దేవగన్ కూడా నటిస్తుండడంతో అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లో ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు జనాలు.ఇక రాజమౌళి కూడా వారి అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిచారు. సినిమాను తెరకెక్కించడమే కాదు ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి కూడా రాజమౌళి కోట్లు ఖర్చు చేయిస్తున్నారు. అపజయం ఎరుగని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఏం చేసినా అందులో ఓ అర్ధం ఉంటుంది. అదే ఆయన స్ట్రాటజీ.

కాగా ఈ సినిమాని సంక్రాంతి పండుగ కానుకగా జనవరీ 7న రిలీజ్ చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ టీం కు భారీ ఎదురుదెబ్బ తగలనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అన్నీ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా నిబంధనలు  పాటించాలని.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ఈసారి భారీ ప్రాణ నష్టం వాటిల్లుతుందని చెప్పుకొచ్చింది. దీంతో అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. కరోనా నిబంధనలు అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ధియేటర్స్ లో మళ్లీ 50 శాతం  ఆక్యుపెన్సీ తోనే ఓపెన్ చేయాలి అని అధికారులు భావిస్తున్నారట. ఇదే కనుక జరిగితే భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమాలకు భారీ షాక్ తప్పదనే చెప్పాలి. దీంతో పరిస్ధితి గ్రహించిన జక్కన్న సినిమాని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి జక్కన్న ఏం చేసాడో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR