తెలుగు సినిమా లో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది నిర్మాతలు ఇప్పుడు వెనకడుగు వేసే పరిస్థితి ఉంది అనే మాట అక్షరాలా నిజం. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం కూడా ఉంది అనే అభిప్రాయాన్ని కొంతమంది సినిమా ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో ఉన్న నేపథ్యంలో కొంతమంది హీరోలు రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని డిమాండ్ కూడా వినపడుతోంది.

తెలుగు సినిమాల్లో చాలా మంది అగ్ర హీరోలు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నిర్మాతలకు తలకుమించిన భారంగా మారే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత మంది అగ్ర హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోకపోతే మాత్రం తెలుగు సినిమా బ్రతికే అవకాశం ఉండదని తెలుగు సినిమాలు పూర్తిగా కొంతమంది అగ్ర హీరోలు భారీ రెమ్యూనరేషన్ తీసుకునే చంపేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది అని కొంతమంది ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది అగ్ర హీరోలకు నిర్మాతలు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే భారీగా చెల్లించే పరిస్థితి ఉండటంతో కొంత మంది దర్శకులు కూడా కొంత మంది అగ్ర హీరోలతో సినిమాలు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంది.

సినిమా హిట్ అయితే ఫర్వాలేదుగానీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం భారీ నష్టాలు చవి చూడటం తో ఇప్పుడు చాలా మంది నిర్మాతలు అగ్ర హీరోలతో సినిమాలు చేయడానికి భయపడిపోతున్నారు అనేది టాలీవుడ్ వర్గాల అభిప్రాయం. కొంతమంది చిన్న హీరోలు కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఈ మధ్యకాలంలో పట్టుదలగా వ్యవహరించడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో అగ్ర నిర్మాతలు ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది హీరోల రెమ్యునరేషన్ భారీగా తగ్గించడానికి  సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: