తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు కొంతమంది హీరోయిన్లు భారంగా మారి పోయారు అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో కొంత మంది అగ్ర హీరోలు ఉన్నారు అని అంటున్నారు. కొంత మంది హీరోయిన్లకు సంబంధించి భారీగా రెమ్యూనరేషన్ తగ్గించడానికి టాలీవుడ్ లో ఉన్న కొంత మంది అగ్ర నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని ఎవరిని వ్యాఖ్యలు చేసినా సరే ఈ విషయంలో మాత్రం వెనకడుగు వేసే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతోంది. కొంతమంది హీరోయిన్లు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే భారీగా వసూలు చేయడం నిర్మాతలకు పెద్ద భారంగా మారింది.

ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే అలాగే రష్మిక మందన రెమ్యూనరేషన్ విషయంలో కాస్త నిర్మాతలు ఆలోచనలో పడ్డారని వీళ్లిద్దరు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నేపథ్యంలో వీరిద్దరూ రెమ్యూనరేషన్ భారీగా తగ్గించకపోతే మాత్రం భవిష్యత్తులో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశం ఉందనే భావనలో టాలీవుడ్ లో ఉన్న ప్రముఖులు ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెమ్యూనరేషన్ కి సంబంధించి ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా సరే వెనక్కుతగ్గే ఆలోచనలో నిర్మాతలు లేరని సమాచారం.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా విడుదలైన సరే భారీగా వసూళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఒకటికి పదిసార్లు ఆలోచించిన తర్వాత నిర్మాతలు ముందడుగు వేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో భారీగా రెమ్యూనరేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉండటమే కాకుండా సినిమా అనేక రకాలుగా ఇబ్బందులు పడే సూచనలు ఉంటాయి. కాబట్టి రష్మిక మందన అలాగే పూజా హెగ్డే అదేవిధంగా కీర్తి సురేష్ రెమ్యునరేషన్ భారీగా తగ్గించాలని మాజీ హీరోయిన్లు సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తే వాళ్ల రెమ్యునరేషన్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని కొంతమంది నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: