తెలుగు చలనచిత్ర సాహిత్య ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రి నిన్న కిమ్స్ ఆసుపత్రి లో పరమపదించారు. ప్రముఖ సాహిత్యవేత్త గా పేరుగాంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో పాటలు రచించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. పాటకు సరళమైన పదాలతో ప్రాణం పోసి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా పాటలను అందించే వారు.

అలాంటి సిరివెన్నెల ఒక హీరోకి మాత్రం ఎంతో అద్భుతమైన పాటలను అందించారు. ముఖ్యంగా ఈ తరంలో సినిమా పాటలు రాయాల్సి వస్తే ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధతో ఆయనకు పాటలు రాసి అవి ఆల్బమ్ పరంగా సూపర్ హిట్ అయ్యేలా చేస్తారు. మరి సిరివెన్నెలకు అంత ప్రీతి పాత్రుడైన హీరో ఎవరు అని అనుకుంటున్నారా.. ఆయనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన తొలి చిత్రం గంగోత్రి దగ్గర నుంచి ఇప్పుడు చేస్తున్న పుష్ప సినిమా వరకు ప్రతి సినిమాలో ఒక పాటనైన సిరివెన్నెల సీతారామశాస్త్రి తో రాయించుకున్న వారు అల్లు అర్జున్.

అలా వీరి కాంబినేషన్ లో సూపర్ హిట్ పాటలు రాగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకున్న అల వైకుంఠ పురం లో సినిమాలోని పాట పెద్ద సెన్సేషన్ సృష్టించింది అని చెప్పవచ్చు. ఆరు పదుల వయసులో కూడా ఇంత రొమాంటిక్ గా ఈ తరం వారు అర్ధం చేసుకునే విధంగా వారు రోజు పాడుకునే విధంగా పాటలు రాయగల సత్తా ఉన్న సీతారామ శాస్త్రి సామజ వర గమన అనే పాట తనకే సొంతమైన పదాలతో రాసి ప్రేక్షకులందరూ కొన్ని సంవత్సరాలు పాడుకునే విధంగా ఆ పాటలను రచించారు. తమన్ సంగీతం సమకూర్చగ ఈ సినిమా లోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యి సినిమా అంత పెద్ద హిట్ అయ్యేలా చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: